
Olympics 2024: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుభారంభం చేశాడు. జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ పోటీల్లో సత్తా చాటి ఫైనల్లో అడుగుపెట్టాడు. సీజన్‌లోనే అత్యుత్తమంగా 89.34 మీటర్ల దూరం బల్లెం విసిరి మరోసారి పసిడి పతక రేసులో నిలిచాడు ఈ గోల్డెన్ బాయ్. గ్రూప్-బి నుంచి తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించాడు.
8️⃣9️⃣.3️⃣4️⃣🚀
ONE THROW IS ALL IT TAKES FOR THE CHAMP! #NeerajChopra qualifies for the Javelin final in style 😎
watch the athlete in action, LIVE NOW on #Sports18 & stream FREE on #JioCinema📲#OlympicsonJioCinema #OlympicsonSports18 #JioCinemaSports #Javelin #Olympics pic.twitter.com/sNK0ry3Bnc— JioCinema (@JioCinema) August 6, 2024
కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు.. నీరజ్ చోప్రాకు గట్టి పోటీగా భావిస్తున్న పాకిస్తాన్ స్టార్ అర్షద్ నదీమ్ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. అతడు 86.59 మీటర్ల దూరం బల్లెం విసిరాడు.
ఇదిలా ఉంటే.. భారత్ నుంచి ప్యారిస్ బరిలో దిగిన మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా నిరాశపరిచాడు. గ్రూప్-‘ఏ’లో ఉన్న ఈ ఒడిశా ప్లేయర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
కాగా ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో ఫైనల్ చేరడానికి అర్హత ప్రమాణంగా 84 మీటర్లుగా నిర్ణయించారు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది ఫైనల్‌కు చేరతారు. ఒకవేళ 12 మంది కంటే ఎక్కువ మంది 84 మీటర్లను దాటి జావెలిన్‌ను విసిరితే ఇందులో నుంచి టాప్–12 మందికి ఫైనల్ బెర్త్‌లు ఖరారవుతాయి. గురువారం ఫైనల్స్ నిర్వహించనున్నారు. .
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో నీరజ్ చోప్రాతో పాటు జావెలిన్ త్రో ఫైనల్‌కు చేరిన ప్లేయర్లు
వాద్లెజ్ జాకూబ్
పీటర్స్ ఆండర్సన్
వాల్కోట్ కెషార్న్
నదీం అర్షద్
వెబర్ జూలియన్
యెగో జూలియస్
ఎటెలటలో లస్సీ
మర్డేర్ ఆండ్రియన్
హెలాండర్ ఒలీవర్
డా సిల్వా లూయిజ్ మౌరిసియో
కెరనెన్ టోనీ