Photo Source: pakistan twitter
ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఆదివారం భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు తమ దేశంలో వరదబాధితులకు సంఘీభావంగా నల్ల బ్యాండ్‌లు ధరించనున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆదివారం తెలిపింది.
"దేశవ్యాప్తంగా వరద బాధితులకు తమ సంఘీభావం, మద్దతును తెలియజేసేందుకు ఈ రోజు భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు నల్ల బ్యాండ్‌లు ధరించనుంది "అని పిసిబి ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా గత కొన్నాళ్లుగా పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా జూన్ 14 నుంచి ఇప్పటి వరకు 1,033 మంది మరణించగా, 1,527 మంది గాయపడ్డారని జియో న్యూస్ నివేదికలలో పేర్కొంది. ఆదే విధంగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 119 మంది మృత్యువాత పడినట్లు పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదివారం ప్రకటించింది.
చదవండి: IND vs PAK Asia Cup 2022: దాయాదుల సమరం.. రికార్డులు, పరుగులు, వికెట్లు చూసేద్దామా!
Comments
Please login to add a commentAdd a comment