PC: IPL.com
ఐపీఎల్-2023లో మరో ఆసక్తికర సమరానికి సమయం అసన్నమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఢిల్లీపై విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆర్సీబీ.. అదే జోరును సీఎస్‌కే పై కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు రాజస్తాన్‌పై ఓటమి పాలైన సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని యోచిస్తోంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని.. కెప్టెన్‌గా జడేజా
ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. మోకాలి గాయంతో బాధపడుతున్న ధోని కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌడర్ రవీంద్ర జడేజా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే వికెట్ కీపర్‌గా డెవాన్ కాన్వే బాధ్యతలు చేపట్టనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సీఎస్‌కే మెనెజ్‌మెంట్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ మ్యాచ్‌కు సీఎస్‌కే ఆటగాళ్లు బెన్ స్టోక్స్, మగాల గాయం కారణంగా దూరంగా ఉండనున్నారు.
కాగా ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై సారధిగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు.
తుది జట్లు:
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, వైషాక్ విజయ్‌కుమార్
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మతీష్ పతిరణ, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్
చదవండి: #Riyan Parag: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు! అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’.. మామూలుగా కాదు..
Comments
Please login to add a commentAdd a comment