
ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో మైదానంలో అడుగుపెట్టిన హిట్‌మ్యాన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అగ్రస్ధానంలో ఉన్నాడు. ధోని ఇప్పటివరకు 256 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాతి స్ధానాల్లో రోహిత్(250), దినేష్ కార్తీక్ ఉన్నాడు.
రోహిత్ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు డెక్కన్ ఛార్జర్స్ తరపున 45 మ్యాచ్‌లు, ముంబై ఇండియన్స్ తరపున 205 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 250 మ్యాచ్‌ల్లో రోహిత్ 6472 పరుగులు చేశాడు.