శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి తర్వాత భారత క్రికెట్ జట్టుకు దాదాపు 40 రోజుల సుదీర్ఘ విరామం లభించింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలు దేశీవాళీ క్రికెట్ ఆడనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరి లెజెండరీ క్రికెటర్లను దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడే అవకాశముంది.
కాగా ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు కూడా దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిందేనని బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రోహిత్, కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం దులీప్ ట్రోఫీ ఆడనున్నట్లు సమాచారం.
బంగ్లాతో సిరీస్‌కు ముందు ఈ టోర్నీని ప్రాక్టీస్ ఉపయోగించుకోవాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది. కాగా బంగ్లాతో టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: Olympics: వినేశ్ విషయంలో మా తప్పేమీ లేదు: పీటీ ఉష
Comments
Please login to add a commentAdd a comment