ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బిగ్ షాక్ తగిలింది. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ గాయపడ్డాడు. రెండో రోజు ఆట సందర్భంగా గిల్ కుడి చూపుడు వేలికి గాయమైంది. ఓ వైపు చేతి వేలి నొప్పితో బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో గిల్ చెలరేగాడు. అయితే ఇప్పుడు అతడికి వేలి నొప్పి ఎక్కువగా ఉండడంతో నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు.
ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా సోమవారం వెల్లడించింది. "రెండో రోజు ఫీల్డింగ్‌లో శుబ్‌మన్ చేతి వేలికి గాయమైంది. అతడు నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉండనున్నాడని" బీసీసీఐ ట్విట్ చేసింది.
అ అతడి స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో మూడో టెస్టు సెంచరీ. తన మూడో టెస్టు సెంచరీని అందుకోవడానికి 12 ఇన్నింగ్స్‌ల సమయం పట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వైజాగ్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 233 పరుగుల అవసరమవ్వగా.. భారత్ గెలిపొందాలంటే మరో 6 వికెట్లు పడగొట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment