వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లను తాయారు చేసే పనిలో బీసీసీఐ పడింది. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టులో భారీ మార్పులు చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విండీస్‌తో టెస్టు, వన్డేలకు జట్టును ప్రకటించిన భారత సెలక్షన్ కమిటీ.. టీ20 సిరీస్‌కు జూలై మొదటి వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీలకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అదరగొట్టిన కుర్రాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విండీస్ సిరీస్‌లో కొన్ని కొత్త ముఖాలను చూసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఐపీఎల్‌లో దుమ్మురేపిన రింకూ సింగ్, యశస్వీ జైశ్వాల్‌తో పాటు ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మను కూడా విండీస్ టూర్‌కు పంపాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారట. ఐపీఎల్-2023లో తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన వర్మ 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు.
గతేడాది సీజన్‌లో కూడా వర్మ దుమ్మురేపాడు. ఐపీఎల్-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 397 పరుగులు చేసింది. తిలక్ వర్మకు ఒత్తిడిని తట్టుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేసేంది. ఈ నేపథ్యంలోనే విండీస్‌తో టీ20 సిరీస్‌కు తిలక్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారంట.
చదవండి: బట్లర్‌కు రాజస్తాన్ రాయల్స్ బంపరాఫర్.. ఏకంగా రూ.40 కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment