టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఫీల్డింగ్ అయినా బ్యాటింగ్ అయినా తన చర్యలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తన చర్యలతో వార్తల్లో నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను కోహ్లి ఆటపట్టించాడు.
ఏమి జరిగిందంటే?
టీమిండియా ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన మాథ్యూస్ బౌలింగ్‌లో మొదటి బంతిని విరాట్ కోహ్లి లెగ్‌సైడ్ వైపు ఆడాడు. ఈ క్రమంలో సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు వెళ్లిన కోహ్లి.. సరదగా తన బ్యాట్‌తో మాథ్యూస్‌ను వెనుక నుంచి కొట్టాడు. దీంతో మాథ్యూస్ కూడా ఒక్కసారిగా నవ్వాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మాథ్యూస్‌కు విరాట్ కోహ్లి మధ్య మంచి స్నేహం ఉంది. 2008 అండర్-19 వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు మాథ్యూస్ ప్రాతినిథ్యం వహించగా.. కోహ్లి భారత్ తరపున ఆడాడు. కాగా ఈ టోర్నీలో మధ్యలో శ్రీలంక పేసన్ మతీషా పతిరానా గాయం కారణంగా తప్పుకున్నాడు. అతడి స్ధానంలో మాథ్యూస్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: WC 2023: శుబ్‌మన్ గిల్ అరుదైన ఘనత.. బాబర్ ఆజం రికార్డు బద్దలు
Lmao why kohli pic.twitter.com/q49iFn3Owt
— mon (@4sacinom) November 2, 2023
Comments
Please login to add a commentAdd a comment