
స్వదేశంలో న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ మహిళా టీమ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (జులై 3) జరిగిన నామమాత్రపు చివరి వన్డేలో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అమేలియా కెర్ (57), కెప్టెన్ సోఫీ డివైన్ (43) రాణించారు. లారెన్ బెల్ ఐదు వికెట్లతో చెలరేగి న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టింది. కేట్ క్రాస్ రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నాట్ సీవర్ బ్రంట్ (76), ఆమీ జోన్స్ (50) విజృంభించడంతో 38.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. ఆఖర్లో అలైస్ క్యాప్సీ (35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కివీస్ బౌలర్లలో హన్న రోవ్ 2, మోలీ పెన్‌ఫోల్డ్, అమేలియా కెర్, బ్రూక్ హ్యలీడే తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు కూడా ఇంగ్లండే గెలిచింది. ఇరు జట్ల మధ్య జులై 6 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. జులై 6, 9, 11, 13, 17 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment