RR Vs LSG: జైశ్వాల్ సూప‌ర్ షాట్‌.. సూర్య‌ను గుర్తు చేశాడుగా! వీడియో వైర‌ల్‌ | IPL 2024 RR Vs LSG: Yashasvi Jaiswal Turns SKY As He Scoops Mohsin Khan For Unbelievable Six, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RR Vs LSG: జైశ్వాల్ సూప‌ర్ షాట్‌.. సూర్య‌ను గుర్తు చేశాడుగా! వీడియో వైర‌ల్‌

Published Sun, Mar 24 2024 6:04 PM | Last Updated on Sun, Mar 24 2024 6:39 PM

Yashasvi Jaiswal Turns SKY As He Scoops Mohsin Khan  For Unbelievable Six - Sakshi

టీమిండియా యువ సంచ‌ల‌నం, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైశ్వాల్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో దుమ్ము లేపిన య‌శ‌స్వీ.. ఇప్పుడు ఐపీఎల్ 2024లోనూ అద‌ర‌గొడుతున్నాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా జైపూర్ వేదిక‌గా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 

కేవ‌లం 12 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 24 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే  ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ అద్భుత‌మైన స్కూప్ షాట్‌తో మెరిశాడు. రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ 5వ ఓవ‌ర్ వేసిన మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో జైశ్వాల్ ఆడిన షాట్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఓవ‌ర్‌లో ఐదో బంతిని మొహ్సిన్ ఖాన్‌.. జైవ్వాల్ ఆఫ్ స్టంప్ లైన్‌లో ఫుల్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. 

ఈ క్ర‌మంలో జైశ్వాల్ చాలా క్విక్‌గా ఎడ‌మ వైపున్‌కి వెళ్లి ఫైన్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడి సిక్స‌ర్‌గా మలిచాడు. దీంతో అంద‌రూ ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు స్కై(సూర్య‌కుమార్ యాద‌వ్‌)ను గుర్తు చేశావంటా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.  రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సంజూ శాంసన్‌ (52 బంతుల్లో 82 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుప‌డ్డాడు. శాంసన్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (43) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ల‌క్నో బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ర‌వి బిష్ణోయ్‌, మోహ్సిన్ ఖాన్ త‌లా వికెట్ ప‌డ‌గొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement