No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, May 5 2024 2:55 AM

-

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కనీస వసతులు లేక కునారిల్లుతుండేవి. ఉపాధ్యాయుల కొరత, వసతుల లేమి, చదువులపై ప్రభావం చూపేవి. కానీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలకంటే మిన్నగా మారాయి. ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్‌ టీవీలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంట్రాక్టివ్‌ ప్లాట్‌ పానల్‌ (ఐపీఎఫ్‌) ద్వారా విద్య బోధిస్తున్నారు. బైజూస్‌ కంటెంట్‌ విద్యనందించేందుకు ట్యాబ్‌లు పరిచయం చేస్తున్నారు. డిజిటల్‌ విద్యను విద్యార్థులకు చేరువ చేస్తున్నారు. ప్రభుత్వ బడులను మనబడి నాడు–నేడు ద్వారా ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. విద్యార్థులకు ఆధునిక మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చారు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. – ఉదయగిరి

Advertisement
Advertisement