కందుకూరులో.. ఇక దూకుడే | Sakshi
Sakshi News home page

కందుకూరులో.. ఇక దూకుడే

Published Mon, May 6 2024 1:20 AM

కందుకూరులో.. ఇక దూకుడే

కందుకూరు: ఒకే ఒక్క బహిరంగ సభ కందుకూరు రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. గెలుపు తమదేనంటూ నిన్నామొన్నటి వరకు అసత్యాలు పలికి ఆనందపడిన టీడీపీ దీని ద్వారా పూర్తిగా చతికిలపడగా, వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం నెలకొంది. కందుకూరు పట్టణంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సభకు కనీవినీ ఎరుగని రీతిలో అభిమాన తరంగం హాజరైంది. కార్యక్రమం విజయవంతం కావడంతో ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలకు మైండ్‌ బ్లాకై ంది. మరోవైపు సమరోత్సాహంతో ఎన్నికలకు పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సై అంటున్నాయి.

నామినేషన్‌.. సభ.. ఇలా ప్రతిదీ జాతరే..

కందుకూరులో వైఎస్సార్సీపీ నిర్వహించే ప్రచార సభలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. పార్టీ నియోజకవర్గ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ తన నామినేషన్‌ను గత నెల 24న దాఖలు చేశారు. కార్యక్రమానికి హాజరైన జనసందోహం ఓ రికార్డుగా మిగిలిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఏరియా హాస్పిటల్‌ కూడలిలో సీఎం నిర్వహించిన బహిరంగ సభ మరో రికార్డును క్రియేట్‌ చేసింది. వారం వ్యవధిలోనే పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమం జాతరలా మారిందంటే అతిశయోక్తి కాదు.

అయ్యో.. అయ్యయ్యో..

తండోపతండాలుగా వచ్చిన జనంతో ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కునుకు కరువైంది. ఈ పరిణామాలతో ఉన్న కొద్ది ఆశలనూ టీడీపీ వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కందుకూరులో విజయం మాదేనంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు.. వైఎస్సార్సీపీ నేతల్లో సఖ్యత కరువైందంటూ ప్రతిపక్ష టీడీపీ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేసి పైశాచికానందం

పొందింది. అయితే ఈ వదంతులు సైకిల్‌ పార్టీ సృష్టేననే విషయం ప్రజలకు అవగతమైంది. నియోజకవర్గంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారం ద్వారా ఈ అనుమానాలు.. ఊహాగానాలు.. అసత్య ప్రచారాలకు చెక్‌ పెడింది. ఈ ఒక్క సభ నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సీఎం సభ తర్వాత మారిన పరిస్థితులు

వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం

ఏకతాటిపైకి మానుగుంట.. బుర్రా

టీడీపీ దుష్ప్రచారానికి చెక్‌

కందుకూరులో అపోహలను రేకెత్తించేందుకు టీడీపీ విశ్వప్రయత్నం చేసింది. అయితే వీటికి చెక్‌ పెడుతూ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కందుకూరు అభ్యర్థి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ఏకతాటిపైకి వచ్చి పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. బుర్రా నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీకి మహీధర్‌రెడ్డి హాజరై కేడర్‌ను ఉత్తేజపర్చారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు, అపోహలకు మహీధర్‌రెడ్డి పూర్తిగా చెక్‌ పెట్టినట్లయింది. మహీధర్‌రెడ్డి సూచనలు, సలహాలను పాటిస్తూ ఆయన మార్గదర్శకత్వంలోనే పనిచేస్తానని బుర్రా ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. దీంతో కార్యకర్తలు, నేతల్లో నెలకొన్న అపోహలు తొలగిపోయాయి.

మహీధరన్నను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా..

ఎమ్మెల్యే పదవి త్యాగాన్ని గుర్తిస్తూ.. మహీధరన్నను గుండెల్లో పెట్టి చూసుకుంటానని.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిచ్చి చట్టసభల్లో కూర్చొనేలా చర్యలు చేపడతానని సీఎం ప్రకటించారు. దీంతో పార్టీలో మహీధర్‌రెడ్డికి సముచిత స్థానం ఉంటుందనే అంశంపై క్లారిటీ లభించింది. దీనిపై ఆయన అనుచరులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement