కలిగిరి: వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఘటన స్థానిక సబ్‌స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన సోమవారం వెలుగులోకి వచ్చింది. విషయాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎస్సై ఉమాశంకర్ పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా నెల్లూరుకు చెందిన రాఘవరెడ్డి (60)గా గుర్తించారు.
కలిగిరికి చెందిన రాఘవరెడ్డి 20 ఏళ్లుగా నెల్లూరులో ఉంటూ, అక్కడే కార్ల షోరూమ్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఒంటరిగా జీవిస్తున్నారు. కలిగిరి, వింజమూరులో ఉన్న బంధువుల వద్దకొచ్చి ఇలా విగతజీవిగా మారారు. కాగా మరణ వార్తపై బంధువులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి వారు చేరుకొని ఎలాంటి కేసు అవసరం లేదని చెప్పి రాఘవరెడ్డి మృతదేహన్ని తీసుకెళ్లారు. మద్యం సేవించి మృతి చెంది ఉండొచ్చని బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.