
వృద్ధురాలి అదృశ్యం
నెల్లూరు సిటీ: మతి స్థిమితం లేని ఓ వృద్ధురాలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు టైలర్స్ కాలనీలో పురుషోత్తం అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది. అతడి తల్లి సుబ్బమ్మకు మూడు సంవత్సరాల నుంచి మతి స్థిమితం లేదు. ఈనెల 2వ తేదీన ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
47.964 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 47.964 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,320, పిన్నేరు కాలువకు 5, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.