
రాజకీయ పార్టీలు పునరాలోచించాలి
● జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇలియాజ్
నెల్లూరు రూరల్: వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు పునరాలోచించి బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇలియాజ్ అన్నారు. నెల్లూరులోని జిల్లా జర్నలిస్ట్ భవన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ దేశంలోని ముస్లింలను మోసం చేస్తోందన్నారు. బిల్లులో ఎన్నో లొసుగులు ఉన్నాయన్నా రు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్రపక్షాలు ముస్లింలను సాంస్కృతికంగా, ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు గతంలో ఉన్న పటిష్టమైన వక్ఫ్ చట్టాన్ని నీరుగార్చారన్నారు. ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాల్సిన వక్ఫ్ బోర్డులో ఇతరులను మెజారిటీ సభ్యులుగా నియమించే విధంగా గత చట్టాన్ని సవరించడం రాజ్యాంగం ప్రసాదిందించిన హక్కులకు పూర్తిగా విరుద్ధమన్నారు. బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. సమావేశంలో సయ్యద్ నవీద్ అహ్మద్, సయ్యద్ షకీల్ అహ్మద్, షేక్ అబ్దుల్ కరీం, జాకీర్, అన్వర్‌బేగ్, అబ్దుల్ గని, సర్దార్ పాల్గొన్నారు.