దావోస్ పేరిట రూ.90 కోట్లు వృథా
ఆమదాలవలస: దావోస్ పర్యటనకు సుమారు నెలరోజుల ముందు నుంచే చంద్రబాబు, ఎల్లో మీడియా హడావుడి చేసిందని, తీరా చూస్తే దావోస్ నుంచి రిక్తహస్తాలతో చంద్రబాబు వెనుదిరిగారని, సుమారు రూ.90 కోట్ల ఖర్చు బూడిద పాలైందని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పక్క రాష్ట్రం తెలంగాణ సుమారు రూ.లక్షా35 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగిందని, మన రాష్ట్రంలో చంద్రబాబు కక్ష సాధింపులపై పెట్టిన శ్రద్ధ పాలనపై చూపడం లేదన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన మొదటి ప్రయత్నంలోనే సుమారు రూ. లక్షా 70 వేల కోట్ల పెట్టుబడులు సాధించారని గుర్తు చేశారు. అప్పట్లో పవన్ కల్యాణ్ స్పందిస్తూ స్వదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రూ.కోట్లు ఖర్చుపెట్టి దావోస్ వరకు వెళ్లాలా! అంటూ ఎద్దేవా చేశారని, మరి ఏ ఒప్పందాలు లేకుండా సుమారు రూ.90 కోట్లు ఖర్చు పెట్టి రిక్త హస్తాలతో తిరిగొచ్చిన చంద్రబాబుపై ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment