రోడ్డెక్కిన వీఓఏలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: డీఆర్‌డీఏ వెలుగు పరిధిలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న గ్రామ ఆర్గనైజేషన్ సహాయకుల(వెలుగు వీఓఏ) సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా గౌర వ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ప్రభావతి, జి.అసిరినాయుడు డిమాండ్ చేశారు. వీఓఏల 7 నెలలు బకా యి వేతనాలు వెంటనే చెల్లించాలని, మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలు మూడు రోజులు కొనసాగిస్తామని చెప్పారు. అనేక రకాల పనులు చేయించుకుంటున్నా వీఓఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలలుగా జీతాలివ్వకుంటే కుటుంబాల పోషణ ఎ లా సాగుతుందన్నారు. ఆన్‌లైన్ సైట్‌లో మార్పులు చేయాలని, కొత్త సిమ్‌లు ఇవ్వాలని, రీచార్జి చేయా లని డిమాండ్ చేశారు. దీక్షలకు సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, కె.సూరయ్య, ఆర్.ప్రకాష్, వీఆర్‌ఏ సంఘం జిల్లా అధ్యక్షులు త్రినాధరావు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలలో సంఘం నాయకులు డి.జోగారావు, జి.యర్రయ్య, వై.అనురాధ, కె.మన్మధరావు, లక్ష్మి, ఎన్.రాజేశ్వరి, నర్తు మహాలక్ష్మి, పి.రమాదేవి పాల్గొన్నారు.
రాజకీయ వేధింపులు ఆపాలి
జిల్లాలో వీఓఏలపై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు. వీటిని నిలిపివేయాలి. వీఓఏలపై పనిభారం తగ్గించాలి. పెరుగుతున్న నిత్యవసరాల ధరలకు అనుగుణంగా వీఓఏలకు జీతాలు పెంచాలి. సకా లంతో జీతాలు మంజూరు చేయాలి.
– ఎం.ప్రభావతి, వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు
అధికారులకు కనీస గౌరవం కూడా లేకుండా పోయింది. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో తీసుకుంటే ఒక కీలక నేత నొటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. పరుష పదజాలంతో నోరు జారడంతో ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతినే పరిస్థితికి వెళ్లిపోయింది. ఏక వచనంతో మాట్లాడటం, తానంటే గౌరవం లేదా అని అరవడం, చెప్పినట్టు చేయకపోతే మామూ లుగా ఉండదని బెదిరించడంతో కార్పొరేషన్‌లో మానసిక ప్రశాంతత కొరవడింది. అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లలో ఎంతమంది పాల్గొన్నా.. తాను చెప్పిన వ్యక్తికి ఇచ్చేలా చేయాలని సతాయించడం, టెండర్లు పిలవకుండా కొన్ని వర్క్‌లను నామినేటేడ్‌గా ఇచ్చేయాలని ఒత్తిడి చేయడం, తాను చెబితే తప్ప మరొకరు చెప్పినది చేయొద్దని హుకుం జారీచేయడంతో అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. కీలక నేత అజమాయిషీ ఇలా ఉంటే, మంత్రుల షాడోలుగా చెప్పుకుని మరో ఇద్దరు కార్పొరేషన్‌లో వేలు పెట్టేశారు. వాళ్లు కూడా అదే స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. తాము చెప్పింది చేయాలని, తాము మంత్రుల మనుషులమని, తేడా వస్తే ఇబ్బందేనని బెదిరిస్తున్నారు. దీంతో కార్పొరేషన్ ఉద్యోగులు నలిగిపోయి, ఏమీ చేయలేని పరిస్థితిలో కుమిలిపోతున్నారు. ఒక్క కార్పొరేషన్‌లోనే కాదు అరసవల్లి దేవస్థానంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఉన్న పలువురి అధికారుల్ని సైతం ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్‌లోనే ఎడాపెడా వాయించేస్తున్నారు.
కనీసం గౌరవం లేకుండా..
Comments
Please login to add a commentAdd a comment