ప్రతిభకు ప్రశంసలు
ఉత్తమ ఉద్యోగులు అవార్డులు అందు కున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డులిచ్చారు. –8లో
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్
పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో అన్ని వర్గాల వారి సహకారంతో అభివృద్ధి సాధిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. 2047 నాటికి శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ పనిచేస్తుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు రైతు ల ఆదాయాన్ని పెంచుతూ, మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసేలా మొత్తం పది సూత్రాలతో ఏర్పాటు చేసిన విజన్ అమలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖలో డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్నామని వివరించారు. అలాగే సాగు వివరాలు వెల్లడించారు. ఉద్యాన శాఖ లో ఎఫ్‌పీఓ సంఘాలకు 75 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం మార్చి 2026 నాటికి, అలాగే హిరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం జూన్ 2025 నాటికి పూర్తి చేయాలన్నదే లక్ష్యంగా తీసుకున్నామన్నారు. జిల్లాలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులు, రీ సర్వే గ్రామ సభల్లో భూమికి సంబంధించి 46,669 దరఖాస్తులు స్వీకరించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నిర్వహిస్తున్న ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ పథకంలో రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ప్రధానమంత్రి కుసుమ పథకంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ అందిస్తున్నామన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమిని రాష్ట్ర ఉత్సవంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వేడుకలు ఫిబ్రవరి 2 నుంచి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.
పట్టపగలే మువ్వన్నెల వెన్నెల కురిసింది. అపురూప గీతాలతో గణతంత్ర వైభవం ఘన మంత్రమై వినిపించింది. అపురూప ప్రదర్శనలతో జాతి నాయకుల త్యాగం పవిత్ర యాగమై కనిపించింది. రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని పురుషుల డిగ్రీ కాలేజీలో ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నాయి. శకటాలు, స్టాళ్లు, సాంస్కృతిక ప్రదర్శనలన్నీ దేశభక్తిని ఇనుమడింపజేశాయి.
● జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
● స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సత్కారం
పతాకావిష్కరణ చేసిన అనంతరం కలెక్టర్ స్వప్నిల్
దినకర్ పుండ్కర్, ఎస్పీ
కేవీ మహేశ్వర రెడ్డి
న్యూసెంట్రల్ స్కూల్ విద్యార్థి విన్యాసం
శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
భారత గణతంత్ర దినోత్సవాన్ని శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పను లు వివరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. కోటబొమ్మాళి మండలం చిట్టివలస గ్రామానికి చెందిన కూరాకుల జయలక్ష్మి, తిలారు గ్రామానికి చెందిన మంత్రి అప్పల రామయ్య, కొత్తపేట గ్రామానికి చెందిన వైశ్యరాజు నర్సింగరాజు, పోలాకి మండలం అంపలాం గ్రామానికి చెందిన నల్లన కృష్ణవేణిలకు జ్ఞాపికలను అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గార కేజీబీవీకి మొదటి బహుమతి, న్యూసెంట్రల్ స్కూల్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్వీఎస్ జోష్ శివ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ బాలలకు ద్వితీయ స్థానం, శ్రీకాకుళంలోని ఐటీడీఏ పోస్ట్ మెట్రిక్ వసతి గృహం విద్యార్థులకు తృతీయ స్థానం లభించాయి. ఆర్సీఎం లయోలా విద్యార్థుల ప్రదర్శనలకు కన్సొలేషన్ బహుమతి లభించింది.
వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై స్టాళ్లు ఏర్పాటు చేశారు. శకటాల ప్రదర్శన అందరినీ అలరించింది. ప్రథమ బహుమతి ఏపీఈపీడీసీఎల్, ద్వితీయ బహుమతి సీ్త్ర శిశు సంక్షేమ శాఖకు, తృతీయ బహుమతి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకానికి దక్కాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రా లు అందజేశారు. వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు, కేఆర్‌సీసీ ప్రత్యేక కలెక్టర్ పద్మావతి, డీఎస్పీ వివేకానంద, డివిజినల్ రెవెన్యూ అధికారి సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం
సోమవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2025
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment