జనం సొమ్మే కదా.. | - | Sakshi
Sakshi News home page

జనం సొమ్మే కదా..

Published Mon, Jan 27 2025 6:35 AM | Last Updated on Mon, Jan 27 2025 6:35 AM

జనం స

జనం సొమ్మే కదా..

నాణ్యత గాలికి..

సమన్వయంతో చేయాల్సిన పనులను గొప్ప కోసం పోయి అసలకే ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న నాసిరకం, తొందర పాటు పనులు కారణంగా భవిష్యత్‌లో నగర ప్రజలకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకుంది. కనీసం వాటరింగ్‌ చేయడానికి 14రోజులు తీసుకోకుండా చేపడుతున్న నిర్మాణాలు ముఖ్యంగా సెంట్రల్‌ లైటింగ్‌ దిమ్మలతో ఏమవుతుందో తెలియని దుస్థితి ఉంది.

డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ నుంచి సెవెన్‌ రోడ్డు జంక్షన్‌ వరకు ఉండే సెంట్రల్‌ లైటింగ్‌ పోల్స్‌ను కూల్చేశారు. అవన్నీ స్క్రాప్‌గా పక్కను పెట్టేశారు. ఇప్పుడా స్థానంలో పాలకొండ రోడ్డు విస్తీర్ణం చూ డకుండా పాత సెంట్రల్‌ డివైడర్‌ను కొంత పొడుగు చేసి, వాటిపై కొత్తగా సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం రూ. 70లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఇదంతా కార్పొరేషన్‌కు అదనపు భారమే.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

థ సప్తమి వేడుకల పేరుతో సర్కారు అనాలోచిత పనులు చేస్తోంది. జనం డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెడుతూ దుబారా చేస్తోంది. ఇంజినీరింగ్‌, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, పోలీసు అధికారుల సమన్వయ లోపంతో పనులు నాసిరకంగా జరగడమే కాదు.. కట్టడం మళ్లీ కూల్చడం మళ్లీ కట్టడం వంటి వింత పనులు కూడా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకల పేరుతో తెలుగు తమ్ముళ్లకు అయాచితంగా కాంట్రాక్ట్‌ పనులు అప్పగించి, లబ్ధి చేకూరే విధంగా చేస్తున్నారే తప్ప నాలుగు కాలాలు ఉండే పనుల్లా కనిపించడం లేదు.

రూపాయి ఇవ్వలేదు..

రథసప్తమి పండగను రాష్ట్ర పండగగా గుర్తించినట్టు జీఓ విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయైనా సాయం చేయలేదు. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఉన్న జనరల్‌ ఫండ్స్‌ను రథసప్తమి వేడుకల కోసం, తొందర పాటు పనుల కోసం రూ.4కోట్లు వెచ్చిస్తున్నారు. అక్కడితో ఆగకుండా శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) కు చెందిన రూ. 40లక్షలను బ్యూటిఫికేషన్‌ కోసమని ఖర్చు చేస్తున్నారు.

రంగుల పూత..

నగరంలో ఉన్న ప్రధాన కూడళ్ల గోడలకు, ప్రభుత్వ కార్యాలయాల గోడలకు, విద్యా సంస్థల ప్రహరీల కు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం హయాంలో వివిధ ఆకృతులతో రంగులు వేశారు. ఇప్పుడు అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటికే ఉన్న రంగులను చెరిపేసి, రూ. కోటికి పైగా వ్యయంతో మళ్లీ రంగులు వేసే కార్యక్రమం తలపెట్టింది. తమ పార్టీ నాయకులకు కాంట్రాక్ట్‌ల కింద పంచి పెట్టడానికి తప్ప ఉపయోగమేమీ లేదు. అలాగని, ఆ రంగులు వేసే కార్యక్రమమైనా సక్రమంగా చేశారా అంటే అదీ లేదు. అక్కడక్కడ చేసి వదిలేశారు. నగరంలో ఉన్న ప్రధాన మార్గాల్లో ఉన్న డివైడర్‌లకు గతంలో తెలుపు, నలుగు రంగుతో ఉండగా, ఇప్పడవి చెరిపేసి పసుపు రంగును పూస్తున్నారు.

రథ సప్తమి పేరుతో ఇష్టానుసారం పనులు

తొందర పాటుతో నాణ్యతకు తిలోదకాలు

నాసిరకం నిర్మాణాలతో భవిష్యత్‌లో ప్రమాదం

రాష్ట్ర పండగగా ప్రకటించినా పైసా విదల్చని సర్కారు

No comments yet. Be the first to comment!
Add a comment
జనం సొమ్మే కదా.. 1
1/1

జనం సొమ్మే కదా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement