విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

Published Sat, May 25 2024 12:10 PM

-

అన్నానగర్‌: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ కార్మికుడు మృతి చెందాడు. సేలం జిల్లాకు చెందిన అన్బళగన్‌ (29). చైన్నెలోని వెస్ట్‌ తాంబరంలో ఉంటూ, కాటుప్పాక్కం పూందమల్లి అమ్మన్‌నగర్‌ ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ భవనం గోడకు శుక్రవారం సిమెంట్‌ ప్లాస్టింగ్‌ పనిచేస్తున్నాడు. ఇందుకోసం సమీపంలోని ట్రాన్‌న్స్‌ఫారంపై ఇనుపరాడ్‌లు కట్టి పనిచేస్తున్నాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తు ట్రాన్‌న్స్‌ఫార్మర్‌ నుంచి వస్తున్న హైవోల్టేజీ తీగపై అన్బళగన్‌ కాలు తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పూందమల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement