క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Fri, Nov 8 2024 2:21 AM | Last Updated on Fri, Nov 8 2024 2:21 AM

-

గున్న ఏనుగు బురద స్నానం

వీడియో వైరల్‌

తిరువొత్తియూరు: జంతువులకు సంబంధించిన అందమైన, తమాషాలు, భయానక వీడియోలు సోషల్‌ మీడియాలో ఇటీవల ఎక్కువగా షేర్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో ఏనుగు పిల్ల బురద స్నానం చేస్తున్న దృశ్యాలు యూజర్లను ఎంతగానో ఆనందపరిచాయి. 48 సెకన్ల వీడియోలో ఏనుగు పిల్ల బురదలోంచి బయటకు వచ్చి తన శరీరమంతా మట్టితో కప్పుకుని నీటి డైవింగ్‌ చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. వీడియో వైరల్‌ కావడంతో కొంతమంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

భార్య ఆత్మహత్య కేసులో

భర్తకు ఏడేళ్లు జైలు

అన్నానగర్‌: కడలూరు సమీపంలో వరకట్న వేధింపులతో నర్సు ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్తకు గురువారం 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. వివరాలు.. కడలూరు జిల్లా పన్రుటి సమీపంలోని కాట్టుకుడలూరు ప్రాంతానికి చెందిన కలైచెల్వాన్‌ (27) కూలి కార్మికుడు. ఇతను వడలూరు సమీ పంలోని కరుంగుళీకి చెందిన సౌందరి (24)ని ప్రేమించి తల్లిదండ్రుల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకున్నారు. సౌందరి నర్సుగా పనిచేసింది. పెళ్లి సమయంలో సౌందరి తల్లిదండ్రులు 15 తులాల ఆభరణాలు, బైకు కొనుగోలు చేసేందుకు రూ.లక్ష చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా 5 తులాల నగలను తీసుకుని రమ్మని సౌందరిని చిత్రహింసలు పెట్టి తల్లిదండ్రుల ఇంటికి భార్యను పంపించాడు. 06.02.2018న కలై చెల్వన్‌ తన సెల్‌ ఫోన్‌ ద్వారా సౌందరి ని ఇంటికి పిలిపించి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన సౌందరి భర్త ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సౌందరి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు ముత్తాండికుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. కలైచెల్వన్‌పై నేరం రుజువు కావడంతో 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి ప్రకటించారు.

లారీని ఢీకొన్న బైక్‌

వ్యక్తి దుర్మరణం

అన్నానగర్‌: ఆగివున్న లారీని బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కోయంబత్తూరుకు చెందిన మహ్మద్‌ ముస్తఫా (34). ఇతని భార్య సజినా (30). వీరు గూడువాంచేరిలో నివాసముంటున్నారు. మహ్మద్‌ ముస్తఫా అంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి. బుధవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. తాంబరం–మధురవాయల్‌ బైపాస్‌ రోడ్డులో పోరూర్‌ టోల్‌గేట్‌ వద్ద వెళుతుండగా బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని ఢీకొంది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహ్మద్‌ ముస్తఫాను స్థానికులు క్రోంపెటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement