ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టు చేసిన ఈడీ
పూర్తి ఆధారాలతోనే అరెస్టు చేసినట్టు పేర్కొన్న ఈడీ అధికారులు
నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ
నేడు ఢిల్లీకి కేసీఆర్, కేటీఆర్.. న్యాయ నిపుణులతో చర్చించే చాన్స్
MLC Kavitha Arrest Updates..
06:14PM
- కవిత భర్త అనిల్కు ఈడీ సమన్లు
- సోమవారం హాజరు కావాలని ఆదేశం
- ఢిల్లీ లిక్కర్ కేసులో అనిల్ ఫోన్లను ఇప్పటికే సీజ్ చేసిన ఈడీ
కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
- ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి
- ఢిల్లీ లిక్కర్ విధానంలో కీలక కుట్రదారు... ప్రధాన లబ్ధిదారు కవితే
- మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు
- ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చారు
- ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు
- అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు
- ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు
- కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు
- సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు: ఈడి
05:05PM
- కవితకు ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించిన సెషన్స్ కోర్టు
- అరెస్టు అక్రమమని వాదించిన విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు
- 23 మార్చి 12 గంటలకు తిరిగి హాజరు పరచాలని ఆదేశం
- కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలిసేందుకు అవకాశం
- ఇంటి భోజనానికి అనుమతి
02:32PM
- కవిత కేసులో ముగిసిన వాదనలు
- పదిరోజుల కస్టడీ కోరిన ఈడీ
- సాయంత్రం నాలుగున్నరకు ఉత్తర్వులు ఇవ్వనున్న కోర్టు
01:39PM
- కవిత కేసు విచారణకు లంచ్ బ్రేక్
- లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ కొనసాగనున్న వాదనలు
01:01PM
ఈడీ తరపు వాదనలు
జోయబ్ హుస్సేన్, ఈడి తరపు న్యాయవాది
- కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశాం
- సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేశాం
- హైదరాబాద్లో 6.26కి సూర్యాస్తమయం జరిగింది
- సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేశాం
- కవిత అరెస్ట్ మెమో చదివి సాయంత్రం 5.43 గంటలకు సంతకం చేశారు
- ఇండో స్పిరిట్ ద్వారా కవిత లిక్కర్ స్కాం చేశారు
- బుచ్చి బాబు, మాగుంట మధ్య వాట్సాప్ చాట్‌లో కవిత పాత్ర బయట పడింది
- ‘మేడంకు 33 శాతం’ అని చాట్లో బయటపడింది
- ఆ మేడం కవితే అని మాగుంట రాఘవ, బుచ్చిబాబు ను విచారిస్తే అంగీకరించారు
- అయిదు ఫోన్లు మేము సీజ్ చేశాం
- అందులోనే డేటాను కూడా రెట్రీవ్ చేశాం
- సెక్షన్ 19 పాటించాము
- నేరం చేసి అక్రమ సొమ్ము సంపాదించారని దర్యాప్తులో తేలింది
- నిన్న సోదాలు 6.45కి పూర్తి అయ్యాయి
- సోదాల సమయంలో కవిత సోదరుడు అని చెప్పి 20 మంది లోపలికి వచ్చి గందరగోళం సృష్టించారు
12:36PM
ఈడి తరపు వాదనలు ప్రారంభం
- మేము బలవంతపు చర్యలు తీసుకోమని ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు
- పది రోజుల టైంతో తదుపరి సమన్లు ఇస్తామని మాత్రమే చెప్పాం
- మీడియా కథనాలను నమ్మవద్దు
- కోర్టు ప్రొసీడింగ్స్ విషయంలో మీడియా కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దు అని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది
- మేము ఇచ్చిన స్టేట్‌మెంట్ వేరే రకంగా ఆపాదిస్తున్నారు
- దీనిపై ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు లేవు
- సెక్షన్ 19 ప్రకారం మేము ముందుకి వెళ్ళాం
- ఇది ఎలాంటి కోర్టు ధిక్కారం కాదు
- మేము తొలుత ఇచ్చిన హామీకి సంభందించిన నెక్స్ట్ డేట్ ఎప్పుడో వెళ్లిపోయింది
- కఠిన నిర్ణయాలలు తీసుకోవద్దని కోరారు. కానీ, కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు
- కఠిన చర్యలు తీసుకోబోమని మేము ఎలాంటి అండర్ టేకింగ్ ఇవ్వలేదు
- పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నిర్ణయానికి రావద్దు
12:12 PM
- వాదనలు ప్రారంభించిన కవిత తరపు న్యాయవాది
- విక్రమ్ చౌదరి, కవిత తరపు న్యాయవాది
- అధికార దుర్వినియోగం తో అరెస్ట్ చేశారు
- సెప్టెంబర్ 15న సుప్రీం కోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారు
- తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పి, ఉల్లంఘించారు
- మహిళను ఈడి కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్ ఉంది
- ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్‌కు కట్టుబడి లేదు
- కోర్టు ఆర్డర్లో రికార్డు చేయనప్పటికీ, మీడియాలో ఇది రిపోర్ట్ అయ్యింది
- నిన్న జరిగిన సుప్రీం కోర్టు విచారణలో ఈడి తరపున ఏఎస్పి రాజు సెప్టెంబర్ లో ఇచ్చిన స్టేట్మెంట్ విత్ డ్రా చేసుకుంటున్నాం అని చెప్పారు
- కానీ సుప్రీం కోర్టు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు, కేసు 19కి వాయిదా వేశారు
- అయినప్పటికీ ఈడి అధికారులు హైదరాబాదులో కవిత ఇంటికి సోదా ల పేరుతో వెళ్లి అరెస్ట్ చేశారు
- ఇది అక్రమ అరెస్ట్.. మూడు రోజులు ఆగితే పోయేదేమిటి
- సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు
- మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ఈడి భావిస్తోంది
12:07 PM..
- కవిత కేసు విచారణ ప్రారంభం
- వాదనలు ప్రారంభించిన కవిత తరపు న్యాయవాది
- విక్రమ్ చౌదరి, కవిత తరపు న్యాయవాది
- అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారు
- సెప్టెంబర్ 15న సుప్రీం కోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారు
- మహిళను ఈడీ కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్‌లో ఉంది
12:05 PM..
కోర్టులో ప్రోసీడింగ్స్ ప్రారంభం.
- కవిత ఆరోపణలు ఇవే..
- నిన్నటి నుంచి నన్ను న్యాయవాదులతో మాట్లాడనివ్వలేదు.
- మధ్యాహ్నం 2 గంటలకు తీసుకువస్తామని 11 గంటలకు తీసుకొచ్చారు.
11:48 AM..
కాసేపట్లో కవిత కేసు విచారణ ప్రారంభం..
- మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసు విచారణ ప్రారంభం
- వారం రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం
- కవిత అరెస్ట్ కేసు విచారించనున్న సీబీఐ స్పెషల్ జడ్జీ ఎం.కె నాగ్ పాల్
- కవిత తరపు వాదనలు వినిపించనున్న విక్రమ్ చౌదరి, మోహిత్ రావు
- ఈడీ తరపు వాదనలు వినిపించనున్న న్యాయవాదులు జోయబ్ హుస్సేన్ , ఎన్.కె మట్టా
- కోర్టు హాల్‌లోనే ఉన్న ఈడీ అధికారులు భానుమతి, జోగెందర్
- విచారణ చూసేందుకు వచ్చిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి
11:48 AM..
►కవితను 10 రోజుల కస్టడీ కోరిన ఈడీ.
►రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
11:40 AM..
►రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరచిన ఈడీ
►ఇది అక్రమ అరెస్టు. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు. న్యాయపోరాటం చేస్తామన్న కవిత
11:17 AM, Mar 16, 2024
►రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న కవిత. కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు.
#WATCH | Delhi: BRS MLC K Kavitha arrives at Rouse Avenue Court.
— ANI (@ANI) March 16, 2024
K Kavitha was arrested by the ED and brought to Delhi yesterday. She will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/4GZ5YRPKS2
►రౌస్ అవెన్యూ కోర్టుకు బయలుదేరిన కవిత.
#WATCH | BRS MLC K Kavitha leaves from ED office for Rouse Avenue Court.
— ANI (@ANI) March 16, 2024
K Kavitha was arrested by the ED and brought to Delhi yesterday. She will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/kGK14Ywrbs
►రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్న ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుమతి, లాయర్లు
►మరి కొద్దిసేపట్లోనే కవితను కోర్టుకు తరలించనున్న ఈడీ అధికారులు
11:30 AM, Mar 16, 2024
నేరం చేయకపోతే భయమెందుకు?: బీజేపీ లక్ష్మణ్
- నేరం చేయకపోతే భయమెందుకు?.
- ఢిల్లీ ప్రభుత్వంలో పెద్దలపై ఈ కేసులో అనేక ఆరోపణలు వచ్చాయి.
- లిక్కర్‌కేసులో కవితకు సంబంధం ఉందో లేదో వారే చెప్పాలి.
- కవిత అరెస్ట్‌కు బీజేపీకి సంబంధం లేదు.
- ఏడాది కాలంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది.
- నేరం చేయకుంచే శిక్ష పడదు.
- తప్పు చేస్తే శిక్ష పడుతుంది.
- ఈడీ తన పని తాను చేసుకుపోతుంది.
- దీనిలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు.
10:30 AM, Mar 16, 2024
►మరి కాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
►ఈడీ కార్యాలయంలో వాహనాలు సిద్ధం చేసిన అధికారులు
►జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ ముందు కవితను హాజరుపరచనున్న ఈడీ అధికారులు.
10:06 AM, Mar 16, 2024
ఈడీ ఆఫీస్ వద్ద హైటెన్షన్
- లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కల్వకుంట్ల కవితకు వైద్య పరీక్షలు పూర్తి
- ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాల మోహరింపు
- కార్యాలయం బయట బీఆర్‌ఎస్ శ్రేణులు
- కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టుకు కవిత తరలింపు
9:35 AM, Mar 16, 2024
►ఎమ్మెల్సీ కవితకు ముగిసిన వైద్య పరీక్షలు. ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన వైద్యుల బృందం.
►ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత తరలింపు.
#WATCH | Delhi: A team of doctors leave from the Enforcement Directorate (ED) office.
— ANI (@ANI) March 16, 2024
BRS MLC K Kavitha was arrested by the ED and brought to Delhi yesterday. She will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/qZ3pF9oL5R
►కవిత అరెస్ట్ నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీ బలగాల మోహరింపు. ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా భద్రత ఏర్పాటు.
#WATCH | Security heightened & a team of doctors arrive at the ED office. BRS leader K Kavitha was arrested in Hyderabad in connection with the Delhi Excise Policy Case.
— ANI (@ANI) March 16, 2024
K Kavitha was brought to Delhi where she will be further questioned in connection with the Delhi excise… pic.twitter.com/hU7Cei4ER7
8:20 AM, Mar 16, 2024
► ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
► ఈరోజు మధ్యాహ్నం కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
కీలకంగా మారిన కవిత అరెస్ట్
- నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు.
- ఉదయం 10 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశ పెట్టనున్న ఈడీ
- ఈరోజు కవితను తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్న ఈడీ అధికారులు
- ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా బినామీ పేర్లతో అక్రమార్జన చేశారని కవితపై అభియోగాలు
- అక్రమార్జన ద్వారా ఇండోస్పిరిట్‌లో పార్ట్‌నర్‌షిప్ పొందారని, అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా వ్యవహారాలు నడిపారని ఆరోపణలు
- ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకంగా మారిన కవిత అరెస్టు
- లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఇప్పటికే పలు ఆధారాలు సంపాదించిన ఈడీ
- అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, అశోక్ కౌశిక్ తదితరులు ఇచ్చిన వాంగ్మూలంలో కవిత పేరు
- దీంతో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు
- ఇక ఈ కేసులో మిగిలింది కేవలం సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మాత్రమే అని చర్చ
నేడు కోర్టు ఎదుట హాజరు
►కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం.
#WATCH | Delhi: BRS MLC K Kavitha brought to the Enforcement Directorate (ED) Office.
— ANI (@ANI) March 15, 2024
K Kavitha had been arrested by the ED and brought to Delhi where she will be further questioned in connection with the Delhi excise policy-linked money laundering case. pic.twitter.com/9TUvwsoa8Z
►ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు.
►ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్‌గా శంషాబాద్‌కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది.
నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి..
►ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించిన @KTRBRS గారు
— Thirupathi Bandari (@BTR_KTR) March 15, 2024
అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్ pic.twitter.com/FsNLeMZPGr
ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్‌రావు
►ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.
అంతకుముందు జరిగింది ఇది..
►ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ సహా అక్కడున్నవారి సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్‌ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
►అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్‌కుమార్‌కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు.
తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు..
ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్‌ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం!
►కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది.
►అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్‌లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అందరికీ అభివాదం చేసి..
►సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్‌కుమార్ కారులో వస్తానని చెప్పారు.
లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ..
►సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022
►శరత్‌చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022
►వినయ్‌బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022
►అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022
►విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022
►అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022
►గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023
►గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023
►మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023
►మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023
►కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024.
Comments
Please login to add a commentAdd a comment