
ఏటూరునాగారం: భారీ వర్షాలు, జంపన్న వాగు వరదతో తీవ్రంగా దెబ్బతిన్న ములుగు జిల్లా ఏటూ రునాగారం మండలం కొండాయి ఇంకా విషాదంలోనే ఉండిపోయింది. వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన 8 మంది గ్రామస్తుల అంత్య క్రియలు కుటుంబ సభ్యుల రోదనల మధ్య శనివా రం పూర్త య్యాయి. గ్రామంలో మట్టి గోడలతో ఉన్న 80 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. గ్రామమంతా నీట మున గడంతో బియ్యం, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తు వులు తడిసి పాడైపోయాయి. ఇళ్లలో, బయట ఎక్క డ చూసినా బురదతోనే నిండిపోయి కనిపిస్తోంది.
బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్
జంపన్న వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోవడంతో కొండాయి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పారిశుధ్య చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది. భారీగా విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో.. మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలేక చీకటిలోనే మగ్గుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బోట్లు ఉన్నంత సేపు కాస్త రాకపోకలు, అవసరమైన సరుకులు అందుతున్నాయి. ఆ బృందాలు వెళ్లిపోతే.. అడవి గ్రామంలో చిక్కుకుపోయినట్టేనని గ్రామస్తులు వాపోతున్నారు.
మరణంలోనూ వీడకుండా..
కొండాయి గ్రామస్తులు రషీద్, ఆయన భార్య కరీమా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వరద దాటుతుండగా కొట్టుకుపోయారని.. చనిపోయేంత వరకు వారు కలిసే ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. మృతదేహాలు కూడా చేయిపట్టుకునే ఉన్నాయని తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు
విపత్కర పరిస్థితిలో చిక్కుకున్న కొండాయి గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకుంటామని, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందజేస్తామని గిరిజన
సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తక్షణ సాయంగా రూ.25 వేలు అందిస్తున్నట్టు చెప్పారు. శనివారం అధికారులతో కలసి ఆమె బోట్లలో కొండాయి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. వరద బాధితులను ఓదార్చారు. ఆస్తి, పంటల నష్టంపై అధికారులు సర్వే చేసి నివేదిక ఇస్తారని.. అనంతరం తగిన సాయం అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment