
తాండూరు రైల్వేస్టేషన్
కొడంగల్ : కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. 40 ఏళ్లుగా ఊరిస్తూ వస్తోంది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఎంపీలు ఈసారైనా పార్లమెంట్‌లో రైల్వే లైన్ గురించి ప్రస్తావిస్తారన్న ఆశతో స్థానికులు ఉన్నారు.
40 ఏళ్ల క్రితమే సర్వే..
కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేయించాలనే ఉద్దేశంతో 1980–81 సంవత్సరంలో అప్పటి మహబూబ్‌నగర్ ఎంపీ, రైల్వేశాఖ సహాయ మంత్రి మల్లికార్జున్ సర్వేకు ఆదేశించారు. వికారాబాద్ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్‌పేట, మద్దూరు, నారాయణపేట, ఊట్కూర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణ వరకు రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. అయితే కొడంగల్ ప్రజల డిమాండ్ మేరకు రెండో పర్యాయం మలి సర్వేకు కేంద్రం ఆదేశించింది. కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మీదుగా రైల్వే లైన్ వేస్తే ఆదాయం వస్తుందని గణాంకాలను విశ్లేషిస్తూ ఇక్కడి ప్రజలు, అధికారులు కేంద్రానికి నివేదిక పంపించారు. కేంద్ర రైల్వే శాఖా మంత్రి ఆదేశాల మేరకు రెండో సారి సర్వే జరిగింది.
కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేస్తే బాగుంటుందని నిపుణులు నివేదిక సమర్పించారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల రాష్ట్ర విభజన, ఆ తర్వాత జిల్లాల విభజన జరిగాయి. కోస్గి, మద్దూరు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలోకి వెళ్లాయి. కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేస్తే జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని విద్యావంతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు.
కొడంగల్ మీదుగా..
వికారాబాద్ జిల్లా నుంచి పరిగి, బొంరాస్‌పేట, కొడంగల్, కోస్గి, మద్దూరు, నారాయణపేట, ఊట్కూర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణ వరకు రైల్వేలైన్ నిర్మిస్తే కొడంగల్ నియోజకవర్గానికి రవాణా సమస్యలు తీరుతాయి. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి సులువుగా ఉంటుంది. అంతేకాకుండా వివిధ రకాల సరుకుల రవాణా ద్వారా రైల్వేశాఖకు ఆదాయం వస్తుంది. మహబూబ్‌నగర్, చేవెళ్ల ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రస్తావించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది
కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్ వల్ల కొడంగల్ నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుంది. రవాణా వ్యవస్థ మె రుగు పడుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటు ంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతిని ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజల సహకారంతో పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాం. సర్వే చేసి వదిలేశారు. ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించాలి.
– అబ్దుల్ హాఖ్, ఉపాధ్యాయుడు, కొడంగల్
Comments
Please login to add a commentAdd a comment