
వేంసూరు: మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి: రైతుబంధు పథకానికి రూ.50వేల కోట్లు రైతులకు నేరుగా అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. సత్తుపల్లి మండలం గంగారంలో మంగళవారం రైతుబంధు సంబురాలను రంగవల్లులతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతువేదిక జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గానికి రైతుబంధు పథకం కింద 80వేల మంది రైతులకు రూ.5.67 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని దీవించాలన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జేడీఏ విజయనిర్మల, ఏడీఏ నర్సింహారావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, రైతు సంఘం కన్వీనర్ గాదె సత్యం, యాగంటి శ్రీనివాసరావు, ఎస్‌కె రఫీ, మాదిరాజు వాసు పాల్గొన్నారు.
వేంసూరు: మండల పరిధిలోని దూళ్లకోత్తురులో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. 70 ఏళ్లలో ఎన్నడు చూడని పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, మండల రైతుబంధు అధ్యక్షులు వెల్ధి జగన్‌మోహన్‌రావు, టీఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
వైరారూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తూ.. ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మండలంలోని కొండకొడిమలో మంగళవారం నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ సభ్యురాలు నంబూరి కనకదుర్గ, సర్పంచ్ దొంతెబోయిన శ్రీను, ఎంపీటీసీ రాయల రమేష్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, ఏడీఏ బాబురావు, ఏఓ ఎస్.పవన్‌కుమార్, ఏఈఓ వెంకటనర్సయ్య తదితరులున్నారు.
మధిర: మధిర వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ పాలాభిషేకం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్ చైర్‌పర్సన్ మొండితోక లత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చావా వేణు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment