తిరుపతి మంగళం : తిరుపతి నగర పాలక సంస్థలో విజయమ మనదే అని, వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష, పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి భూమన అభినయ్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డితో కలిసి కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 42వ డివిజన్‌కు చెందిన ఎం.శేఖర్‌రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే కౌన్సిల్‌లో విప్‌గా 1వ డివిజన్‌కు చెందిన ఆదం రాధాకృష్ణారెడ్డిని నియమించారు. భూమన మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా, కష్టకాలంలో కూడా మేము మీ వెంటే ఉన్నామంటూ కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులుగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్, ఆయన తనడుకు జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో ధైర్యంగా పోరాటం సాగిస్తామని వెల్లడించారు. ఇటీవల జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించేందుకు జగనన్న వస్తే స్వచ్ఛందంగా తరలివచ్చిన జనసమూహాన్ని చూసి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు దిమ్మతిరిగిందని తెలిపారు. సమావేశంలో 30 మంది కార్పొరేటరు పాల్గొన్నారు. మరో ముగ్గురు కార్పొరేటర్లు సొంత పనుల నిమిత్తం బయట ఉన్నారని నేతలు వెల్లడించారు.
మాట్లాడుతున్న భూమన, పక్కన ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష, అభినయ్‌రెడ్డి, జయచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment