నాలుగు విఫలం.. 13 సఫలం
జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇస్రో ఇప్పటి వరకు 17 ప్రయోగాలు చేసింది. అందులో 13 ప్రయోగాలను విజయవంతం కాగా, కేవలం నాలుగు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. బుధవారం నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15 ఈ సిరీస్‌లో 17వ ప్రయోగం. ఇది వందో ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తల్లో కొంత టెన్షన్ వుంటుంది. ఎందుకంటే 2010 ఏప్రిల్ 15న స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ దశతో చేసిన జీఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగం విఫలమైంది. అదే సంవత్సరం డిసెంబర్ 25న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్6 ప్రయోగంలో రష్యన్ క్రయోజనిక్ దశతో చేసినప్పటికీ విఫలమైంది. ఈ రాకెట్ నింగివైపునకు వెళ్లేటపుడు క్రయోజనిక్ దశ కిందిభాగంలో వున్న స్టడ్ విరిగిపోవడంతో మిషన్ కంట్రోల్ రూమ్ నుంచే బ్లాస్ట్ చేశారు. తర్వాత 2010 నుంచి 2014 దాకా జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల జోలికే ఇస్రో పోలేదు. క్రయోజనిక్ ఇంధనం లిక్విడ్ అక్సిడైజర్, లిక్విడ్ హైడ్రోజన్ కలిపి మైనస్ 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే సంక్లిష్టమైన క్రయోజనిక్ టెక్నాలజీని అందుకోవడానికి తొలి నాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నేడు సగర్వంగా నిలబడింది.
Comments
Please login to add a commentAdd a comment