మహిళా వర్సిటీలో అడ్మిషన్‌కు దరఖాస్తులు
తిరుపతి సిటీ : పద్మావతి మహిళావర్సిటీలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ప్రధానంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (సంగీతం), మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (తెలుగు), డిప్లొమా ఇన్ మ్యూజిక్ (సంకీర్తన, వర్ణం, అన్నమయ్య అంతరంగం) కోర్సులలో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు ఫారం, అర్హత, ఫీజు, కోర్సు వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. ఇతర వివరాలకు 0877–2284524, 8121787415 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
టెక్‌ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21వ తేదీ నుంచి నిర్వహించనున్న జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ పోస్టర్‌ను బుధవారంవిడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ ఉమ మాట్లాడుతూ విద్యుత్సావ్–2కే25, మెకేరెనా–2కే25 పేరుతో జాతీయ స్థాయి టెక్‌ఫెస్ట్‌ను వర్సిటీలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రజని, ఎస్ఓఈటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మల్లికార్జున, ప్రొఫెసర్ వీరారెడ్డి పాల్గొన్నారు.
బ్రిడ్జి కోర్సుకు ఉచిత శిక్షణ
తిరుపతి ఎడ్యుకేషన్ : ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాలిటెక్నిక్ డిప్లొమో రెండో ఏడాదిలో ప్రవేశం కోసం అర్హత పరీక్షకు బ్రిడ్జి కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తిరుపతి పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ వి.శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఆసక్తి గల అభ్యర్థులు ఐటీఐ, పదో తరగతి సర్టిఫికెట్ల జిరాక్స్‌లు, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతో ఈ నెల 31వ తేదీలోపు తమ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వీరికి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐటీఐలో 60 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 85000 21856 నంబరులో సంప్రదించాలని సూచించారు.
రేపటి వరకు
‘టీఐఎస్’కు గడువు
తిరుపతి అర్బన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్) వివరాల నమోదుకు, ఎడిట్ ఆప్షన్‌కు ఈ నెల 31వ తేది వరకు గడువు పెంచినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వారు నమోదు చేసుకున్న వివరాలు ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే గడువులోపు వివరాలు నమోదు, సవరణ చేయని వారికి మరో అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment