చంద్రగిరి : మండలంలోని పనపాకం వద్ద ఆగిపోయిన జాతీయ రహదారి నిర్మాణ పనులను ఆర్‌డీఓ రామ్మోహన్ పరిశీలించారు. బుధవారం ఈ మేరకు తహసీల్దార్ శివరామసుబ్బయ్యతో పెండింగ్ పనులపై చర్చించారు. ఆర్‌డీఓ మాట్లాడుతూ పనపాకం నుంచి రవణప్పగారిపల్లె వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర హైవే పనులు నిలిచిపోయినట్లు తెలిపారు. ప్రసుతతం తాత్కాలికంగా సింగిల్ రోడ్డు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఇరుకుగా మారిన ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురి ప్రాణాలు పోతున్నాయన్నారు. అందుకే రహదారి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు చరయలు చేపడుతున్నామని వివరించారు. ఈ మేరకు నిర్వాసితులతో కలెక్టర్ సైతం మాట్లాడారని, పరిహారం త్వరితగతిన చెల్లించేందుకు చొరవ తీసుకున్నట్లు తెలిపారు. హైవే పూర్తి చేస్తే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment