దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట

Published Fri, Jan 31 2025 2:01 AM | Last Updated on Fri, Jan 31 2025 2:01 AM

-

● టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ధ్వజం

తిరుపతి గాంధీ రోడ్‌: చంద్రబాబు హయాంలో టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..్ఙచంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం టీటీడీని పూర్తిగా భ్రష్టు పట్టించిందని, పాప ప్రక్షాళన చేసి స్వామివారి ఆలయాన్ని పునీతం చేసి ఒక గాడికి తెచ్చి భక్తులకు చాలా మెరుగైన సౌకర్యాలు, ఉన్నతమైన దర్శనం కల్పిస్తామని చిలక పలుకులు పలికారు. అయితే వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సమయంలో క్యూలను సైతం సరిగా నిర్వహించలేని పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానిది. అవగాహన రాహిత్యంతో ఆరుగురు భక్తులు చనిపోయారు. 40 మందికి పైగా భక్తులకు తీవ్ర గాయాలపాలయ్యారు. కేవలం ఈ ప్రభుత్వం అలసత్వం, బాధ్యతారాహిత్యం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. వైఎస్సార్‌సీపీ హయాంలో చైర్మన్‌గా వ్యవహరించిన నేను, వైవీ సుబ్బారెడ్డి లడ్డూ ప్రసాదాలకు వినియోగించే నెయ్యిలో ఆవు, పంది కొవ్వు కలిపామని చంద్రబాబు అత్యంత దారుణమైన ఆరోపణలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు సీబీఐ విచారణ వేయమని చెప్పింది. ఆ ఒక్క మాట ద్వారా చంద్రబాబు వ్యక్తిత్వం పాతాళంలోకి పడిపోయింది. పరమ భక్తుడిని అని చెప్పుకునే చంద్రబాబు స్వామి వారిని రాజకీయాలకు వాడుకుంటున్నారు. కేవలం రాజకీయాలకు పావుగా శ్రీవారి పేరును చంద్రబాబు వాడుకోవడం శోచనీయం. చంద్రబాబు పాలనపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. తిరుమలలో ఆరేళ్ల బాలుడు కిందపడి చనిపోయాడు. లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. టీటీడీ ఉద్యోగులే నాలుగు మాడ వీధుల్లో చెప్పులు ధరించి నడుస్తున్నారు. కొండపైకి బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చి ఆలయం ముందు భాగంలో ఉన్న రాంబగీచా బస్‌ స్టాండ్‌ వద్ద భక్తులు తిన్నారు. తిరుమలలో మద్యం బాటిల్స్‌ విక్రయిస్తుంటారని సమాచారం. ఇదీ చంద్రబాబూ.. మీరు చేస్తున్న పాలనలో టీటీడీ నిర్వాకం. తిరుమలను ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు ఓ రహదారిగా మార్చారు. టీటీడీ చాగంటి కోటేశ్వరరావు సరిగా పట్టించుకోలేది చెప్పిన యూట్యూబ్‌ చానళ్లపై కేసులు పెట్టారు. ఆ చానల్‌ అనుమతిని సైతం రద్దు చేయాలనే తలంపు చేపట్టారు. ఇందులో ఇద్దరు చానెళ్ల అధిపతుల హస్తం ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు చాగంటి వచ్చారు. ఆయన ప్రవచనాలను వాడుకోవడంలో టీటీడీ విఫలమైందని సదరు యూట్యూబ్‌ చానల్‌ వారు చెప్పారు. కొండపై బిర్యానీ తిన్నా, మద్యం విక్రయిస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. ఎరచ్రందనం దుంగలు తరలిస్తున్నా చర్యలు కరువు. ఆరుగురు చనిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జేఈవోను ట్రాన్స్‌ఫర్‌ చేసి చేతులు దులుపుకున్నారు. వైఎన్‌ఆర్‌ అనే సీనియర్‌ జర్నలిస్టుపై అబద్ధపు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా మాట్లాడితే వైఎన్‌ఆర్‌ పై దాడిచేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement