తిరుపతి కల్చరల్: ప్రయాగరాజ్ మహా కుంభ మేళా యాత్రకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టూరు బస్సులు నడుపుతున్నట్లు ఆంధ్రపదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ సీహెచ్.శ్రీనివాసరావు ఇందులో భాగంగా తిరుపతి నుంచి ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటలకు బస్సు బయలు దేరి కడప, కర్నూలు, హైదరాబాద్ ప్రయాణికులను పికప్ చేసుకొని వెళ్లి తిరిగి 18వ తేదీన తిరుపతికి చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే నెల్లూరు నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, విశాఖటప్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చండీఘర్, గయా, బుద్ధ గయా, కాశీ, మీదుగా ప్రయాగరాజ్కు యాత్ర బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెల్లూరు నుంచి ఫిబ్రవరి 12వ తేదీ బస్సు యాత్ర ఆరంభమై 19వ తేదీ నెల్లూరుతో యాత్ర పూర్తవుతుందని తెలిపారు. ఈ రెండు యాత్రలకు దర్శనం ఖర్చులు, టిఫిన్, భోజనం ఖర్చులు ప్రయాణికులే భరించాలని తెలిపారు. ఈ యాత్రకు అనువైన వోల్వో, మల్టీ యాక్సిల్, సెమీ స్లీపర్ బస్సులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కుంభమేళాకు వెళ్ల దలిచిన ప్రయాణికులు ఏపీ టూరిజం డెవలప్మెంట్ సీఆర్వో ఆఫీసు లేదా వారి ఆధీకృత ఏజెంట్ల ద్వారా యాత్రకు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మహా కుంభమేళా యాత్రకు వెళ్ల దలచిన వారు మరిన్ని వివరాలకు 9848850099, 9848973985, 9848884299లను సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment