ఎస్పీడీసీఎల్లో పదోన్నతులు
● చీఫ్ ఇంజినీర్‌గా శోభవాలంటీనా ● ఎస్ఈలుగా ఐదుగురు ● ఈఈలుగా ఆరుగురు ● డీఈఈలుగా పది మందికి పదోన్నతులు
తిరుపతి రూరల్: దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) పరిధిలో పలువురికి పదోన్నతి కల్పిస్తూ గురువారం సాయంత్రం సంస్థ సీఎండి సంతోషరావు ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా ఉన్న శోభ వాలంటీనా కు చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా చక్రపాణి, నీలం నరేంద్రనాథ్, రమేష్, శేషాద్రి శేఖర్, మురళీధర్ బాబులకు పదోన్నతులు ఇచ్చారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఉన్న వెంకట ప్రసాద్, బాలాజీ, భాను నాయక్, పద్మనాభం పిళ్ళై, వివేకానంద స్వామి, శ్రీరాములకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. యమున, రఘు, వరప్రసాద్ రెడ్డి, బాలాజీ, వెంకటసుబ్బయ్య, శ్రీదేవి, భార్గవి, నాగరాజు కుమార్, నరేంద్ర రావు, రాధికాలకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతి కల్పిస్తూ సీఎండీ సంతోష రావు ఉత్తర్వులు జారీచేశారు.
గో సంరక్షణతో సమాజం సుభిక్షితం
తిరుపతి కల్చరల్: గో సంరక్షణతో భూమిని రక్షించి సమాజ సుభిక్షతంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గోరక్ష మహా పాదయాత్ర నిర్వాహకుడు బాలకృష్ణ గురుస్వామి పిలుపునిచ్చారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే డిమాండ్‌తో గత సెప్టెంబర్ 25న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోవుతో మహా పాదయాత్ర చేస్తూ తిరుపతికి చేరుకున్నట్టు గుర్తుచేశారు. సమావేశంలో గో పరిరక్షణ నిర్వాహకులు, ప్రకృతి వ్యవసాయ దారులు ప్రభాకర్, చంద్రమౌళి, నిరంజన్ వర్మస్వామీజీ, గీతాంజలి, ఝాన్సీ లక్షీభాయ్, శ్రీనివాస్, జగన్మాథం పాల్గొన్నారు.
ప్రాణం తీసిన వివాదం
– తమ్ముడి చేతిలో అన్న మృతి
కోట: తమ్ముడు కర్రతో తలపై బలంగా కొట్టడంతో అన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురువారం కోట మండలం, జరుగుమల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ పవన్‌కుమార్, తెలిపిన వివరాల మేరకు.. జరుగుమల్లి గమళ్లపాళెంకు చెందిన కుమారి కోటయ్య(46), మస్తానయ్య అన్నదమ్ములు. కల్లుగీత కార్మికులుగా పనిచేస్తూ పక్కపక్కనే నివాసాలు ఉంటున్నారు. మస్తానయ్య భార్య గుడ్డలు ఉతికే క్రమంలో మురికినీరు కోటయ్య వాకిలిలోకి వస్తుండగా ఇద్దరి భార్యలు గొడవ పడ్డారు. వివాదం కాస్త అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసింది. కోటయ్య తమ్ముడు మస్తానయ్యపై కర్రతో దాడి చేశాడు. దీంతో మస్తానయ్య సమీపంలో ఉన్న మరో కర్రతో కోటయ్య తలపై బలంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలాడు. ఈ ఘటన వాళ్ల తండ్రి వెంకయ్య సమక్షంలోనే జరిగింది. కోటయ్యను కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో జరుగుమల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment