చంద్రగిరి: ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఆక్రమంగా నిర్మిస్తున్న పశువుల షెడ్డుకు అధికారులు నిధులు మంజూరు చేయడం విమర్శలకు తావ్విస్తోంది. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం పశువుల షెడ్డు నిర్మాణం చేయదలచిన పాడి రైతులకు సబ్సిడీ నగదును అందిస్తోంది. ఈ క్రమంలో మండల పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి ఆనుకుని ఉన్న భీమవరం లెక్కదాఖల సర్వే నం.155/1లోని కాలువ పోరంబోకు, సర్వే నం.153లోని ప్రభుత్వ భూమిని అక్రమించుకుని పశువుల షెడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డుకు స్థానిక ప్రభుత్వ అధికారులే ప్రత్యక్షంగా ప్రోత్సహించడం విమర్శలకు తావ్విస్తోంది. దీనిపై గ్రామస్తులు సైతం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆక్రమణ విషయమై వీఆర్ఓ భాస్కర్‌ను వివరణ కోరగా... రైతు పక్కన కొంతమేర ప్రభుత్వ భూమి ఉందని, ప్రస్తుతం పనులను నిలిపివేశామన్నారు. సర్వే అనంతరం రైతు భూమిలోనే పశువుల షెడ్డును ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
ప్రభుత్వ భూమి ఆక్రమణ
ఎంచక్కా పశువుల షెడ్డు నిర్మాణం
అడ్డుకోని యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment