
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి పట్టణ శివారు వీఎపంల్లి పీఎన్ జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం.. అమ్మపాళెంకు చెందిన మధుసూన్‌రెడ్డి కారులో నెల్లూరుకు బయలుదేరాడు. అదే సమయంలో ప్రకాశం జిల్లాకుకు చెందిన ప్రభుదాస్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమలకు వస్తున్నాడు. మార్గమధ్యంలో వీఎంపల్లి వద్ద మధుసూదన్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ అవతలి వైపు వస్తున్న ప్రభుదాస్ కారును ఢీకొంది. ఈ ఘటనలో మధుసూదన్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా.. ప్రభుదాస్, అతని భార్య హర్షిత, కుమారుడు సామి, అల్లుడు గిరీష్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్‌రెడ్డిని ప్రథమ చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు