
అట్టహాసంగా తిరుపతి రూరల్ ఎంపీపీ బాధ్యతల స్వీకరణ
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీ బాధ్యతల స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గత నెల 27న జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మూలం చంద్రమోహన్‌రెడ్డి విజయం సాధించిన విషయం విధితమే. ఈమేరకు ఆయన తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్‌లో సోమవారం బాధ్యతలను స్వీకరించారు. తర్వాత ఎంపీపీని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. తదనంతరం ఎంపీపీ దంపతులు మోహిత్‌రెడ్డిని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. వైస్ ఎంపీపీ మాధవరెడ్డి, యశోదతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీపీని సత్కరించారు. అలాగే ఎంపీడీవో రామచంద్రతో పాటు కార్యాలయ సిబ్బంది సత్కరించి అభినందనలు తెలిపారు.
ఫ్లెక్సీలపై అధికారుల ఓవరాక్షన్
తిరుపతి రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన మూలం చంద్రమోహన్‌రెడ్డికి పలువురు ఎంపీటీసీలు, పార్టీ నేతలు, శ్రేయోభిలాషులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే వీటి ఏర్పాటు విషయంలో పంచాయతీ అధికారులు ఓవరాక్షన్ చేసి వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. దీన్ని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆపై ప్రమాణస్వీకర మహోత్సవం పూర్తవగానే ఫ్లెక్సీలను తొలగించారు.

అట్టహాసంగా తిరుపతి రూరల్ ఎంపీపీ బాధ్యతల స్వీకరణ