Woman Murders Police Husband For Lover In Visakhapatnam; Here Record Video - Sakshi
Sakshi News home page

మటన్‌ పెట్టి.. మద్యం తాగించి..

Published Sun, Aug 6 2023 1:12 AM | Last Updated on Mon, Aug 7 2023 2:48 PM

- - Sakshi

విశాఖపట్నం: వన్‌టౌన్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ హత్య కేసులో లభించిన వీడియో చూసిన పోలీసులు.. అతని భార్య తెలివితేటలకు షాక్‌ అయ్యారు. ప్రియుడు రామారావుతో కలిసి శివాని మంగళవారం రాత్రి రమేష్‌ను ఊపిరాడకుండా చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. రమేష్‌ హత్యకు ముందు ప్రియు డితో కలిసి ఆమె పెద్ద కుట్రే పన్నింది. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియో రికార్డు చేసింది. మంగళవారం రాత్రి భర్తకి మటన్‌ వండి పెట్టి.. మద్యం తాగించింది.

నా భార్య చాలా మంచిది.. ధైర్యవంతురాలు, మై వైఫ్‌.. మై లైఫ్‌ అంటూ అతనితో చెప్పించింది. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టింది. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. హత్య నేరం తనపైకి రాకుండా ఉండేందుకే.. తాను మంచిదానినంటూ భర్తతో చెప్పించే ప్రయత్నంగా ఈ వీడియో తీసినట్లు పోలీసులు ఎదుట ఆమె అంగీకరించింది. దీంతో ఆమె నేరపూరిత వైఖరి పట్ల అంతా అవాక్కవుతున్నారు.

కాగా.. తన పెద్దమ్మ కూతురు పైడమ్మ ద్వారానే టాక్సీ డ్రైవర్‌ రామా రావు పరిచయం అయినట్లు పోలీసుల దర్యాప్తులో శివాని చెప్పినట్లు సమాచారం. పైడమ్మకు కూడా ఈ హత్య కేసులో సంబంధం ఉందని పోలీసులను శివాని నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ కేసులో శివానీతో పాటు ప్రియు డు రామారావు, అతని స్నేహితుడు నీలాపై మాత్రమే ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement