● ఉమ్మడి విశాఖ జిల్లాల్లో 5 ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీ ఎన్నికలు ● 4 ఎంపీపీలు, ఒక వైఎస్ ఎంపీపీ స్థానాలు వైఎస్సార్ సీపీ కై వసం ● సబ్బవరంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల గైర్హాజరుతో వైస్ ఎంపీపీగాస్వతంత్ర అభ్యర్థి విజయం ● ప్రలోభాలకు గురిచేసి జి.మాడుగులలో టీడీపీ ఎంపీపీ ఎన్నిక
సాక్షి, అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ జోరు పెంచింది. అనకాపల్లి జిల్లాలో 4 ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీ స్థానాలకు గానూ 4 ఎంపీపీలు, ఒక వైస్ ఎంపీపీ స్థానాలను వైఎస్సార్ సీపీనే కై వసం చేసుకుని విజయదుందుభి మోగించింది. మరో వైస్ ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ గైర్హాజరు కావడంతో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. కూటమి నేతలు అధికార బలంతో బెదిరింపులు, ప్రలోభాలకు తెరదీసినా వైఎస్సార్ సీపీలోనే ఉంటాం.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటామంటూ గెలిపించి చూపించారు. బలం లేకపోయినా గెలవాలన్న కూటమి నేతల కుట్రలకు చెక్ పెట్టారు. అనకాపల్లి జిల్లాలో ఎస్.రాయవరం, దేవరాపల్లి, మాకవరపాలెం, మాడుగుల ఎంపీపీలుగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాకవరపాలెంలో ఎంపీపీ ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచి కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురి చేయడం చేశారు. కానీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో ఎంపీటీసీ సభ్యులందరూ వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారు. మాకవరపాలెం ఎంపీపీ–రుత్తల సర్వేశ్వరరావు(వైఎస్సార్‌సీపీ), ఎస్.రాయవరం ఎంపీపీ–కేసుబోయిన వెంకటలక్ష్మి (వైఎస్సార్‌సీపీ), దేవరాపల్లి ఎంపీపీ–చింతలబుల్లి లక్ష్మి (వైఎస్సార్‌సీపీ) వి.మాడుగుల, తాళ్లపురెడ్డి వెంకటరాజారాం(వైఎస్సార్‌సీపీ) గెలిచారు. చోడవరం వైస్ ఎంపీపీగా శరగడం లక్ష్మి(వైఎస్సార్‌సీపీ), సబ్బవరం వైస్ ఎంపీపీ–మామిడి లక్ష్మి(ఇండిపెండెంట్) గెలుపొందారు.
● సబ్బవరం మండలం వైస్ ఎంపీపీగా గెలిచిన మామిడి లక్ష్మి గతంలో వైఎస్సార్ సీపీలోనే ఎంపీటీసీగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మొత్తం 19 మంది సభ్యులకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో మిగిలిన 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు.
● పెందుర్తి మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా ముదపాకకు చెందిన ముదపాక శివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన రాజయ్యపేట వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు ముదపాక దేవి కుమారుడు. ఇక్కడ వేరెవరూ పోటీకి దిగకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
● పెందుర్తి మండలంలోని చింతగట్ల ఉపసర్పంచ్‌గా టీడీపీ నేత గండి బాబ్జీ వర్గానికి చెందిన బొట్టా కనకమహాలక్ష్మి ఉత్కంఠ పోరులో విజేతగా నిలిచారు. ఎమ్మెల్యే పంచకర్ల వర్గానికి చెందిన దమ్ము సుశీల బరిలో నిలవడంతో ఇరువురికీ చెరో 4 ఓట్లు వచ్చాయి. సర్పంచ్ గనిశెట్టి వెంకటలక్ష్మి తన ఓటు కనకమహాలక్ష్మికి వేయడంతో బొట్టా గెలుపు ఖాయమైంది.
● సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం, పైడివాడ అగ్రహారం ఉప సర్పంచ్‌లుగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు సింగంపల్లి దేవి, మడక సరోజిని ఎన్నికయ్యారు.
● అల్లూరి సీతారామరాజు జిల్లాలో జి.మాడుగుల ఎంపీపీగా టీడీపీకి చెందిన లంబోరి అప్పలరాజు గెలుపొందారు.
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి