మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.. | Sakshi
Sakshi News home page

మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే..

Published Mon, May 6 2024 4:00 AM

మళ్లీ

గుర్ల: రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్‌సీపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని నడుపూరు, ఆనందపురం, కోటగండ్రేడు, గూడేంలలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు పన్నుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మరో నెల రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని చెప్పారు. టీడీపీ నాయకుల తీరు వల్ల 34 మంది వృద్ధులు పింఛన్‌ తీసుకోవడానికి వెళ్లి మరణించారని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్‌ ఠంచన్‌గా అందాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే రావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో అర్హులైన వారిందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నాడు – నేడు ద్వారా పాఠశాలలు, ఆస్పత్రులను అభివృద్ధి చేశామని.. దళారీ వ్యవస్థ లేకుండా పథకాలు అందించామని చెప్పారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్‌ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పొట్నూరు సన్యాసినాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు జమ్ము స్వామినాయుడు, జేసీఎస్‌ కన్వీనర్లు బెల్లాన బంగారునాయుడు, కెంగువ మధుసూదనరావు, వైస్‌ ఎంపీపీ తోట తిరుపతిరావు, నేతలు వరదా ఈశ్వరరావు, కరోత్ర తాతమ్మ, మీసాల చిన్నప్పలనాయుడు, ముద్దాడ శ్రీనివాసరావు, ఎజ్జిపరుపు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే..
1/2

మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే..

మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే..
2/2

మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే..

Advertisement
 
Advertisement