● 50 మంది అంగీకారం ● మానవీయత సంస్థకు అంగీకార పత్రాల అంద
చీపురుపల్లి: వారంతా పెద్దగా చదువుకోలేదు.. అయితేనేం ఎంతో మందికి ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది ఒక్కటిగా ఆలోచించారు. పదుగురికి ప్రయోజనకరమైన నిర్ణయాన్ని తీసుకొని సంబంధిత అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఆ పత్రాలను అవయవదాన సంస్థలకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. చీపురుపల్లి మండలంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన 50 మంది నివాసితులు తమ మరణానంతరం అవయవదానానికి అంగీకారం తెలిపారు. సంబంధిత పత్రాలను చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ, మెట్టపల్లికి చెందిన నవభారత్ ఫౌండేషన్ వారికి అందజేశారు. ఆదివారం మెట్టపల్లిలో ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన కార్యక్రమంలో ఈ పత్రాలను సంస్థ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మానవీయత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బీవీ గోవిందరాజులు మాట్లాడుతూ అవయవదానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అవయవదానం ద్వారా వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. కొందరికి అవయవాలు దానం కూడా చేయవచ్చన్నారు. దాతల దాతృత్వాన్ని పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment