విజయభావన ‘సాహిత్య ప్రయోజనం’
విజయనగరం టౌన్: విజయభావన సాహితీ మిత్ర సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన సాహిత్య ప్రయోజనం ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రధానవక్తగా విశాఖ గాయత్రీ విద్యాపరిషత్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్వమంగళశాస్త్రి మాట్లాడుతూ సంప్రదాయాన్ని ఒక జీవ నదిగా పోలిక చేస్తూ, సంప్రదాయం లేనిదే ప్రగతి లేదని ఉద్ఘాటించారు. జీవ నదిలో కాలానుగుణంగా ఎన్నో పిల్ల కాలువలు వచ్చి చేరి బలాన్నిస్తాయని, అప్పడప్పుడు మట్టి బురద చేరినా వాటిని పక్కకి తొలగించుకుని నిరంతరంగా ఈ సాహితీ గంగ ప్రవహిస్తుందన్నారు. నన్నయ్య నుంచి గురజాడ వరకూ సాహిత్యంలో స్థిరంగా నిలబడి ఉన్న మలిక సంప్రదాయ యోచనను ప్రామాణికంగా నిరూపించారన్నారు. ఆధునికం వచ్చినా మూలం మారలేదని వివరిస్తూ దాంపత్యం ధర్మంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమను ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని ఉదాహరించారు. సభాధ్యక్షతను గ్రంథాల య సంస్థ పూర్వాధ్యక్షులు రొంగలిపోతన్న, సమ్మానకర్తగా ధర్మవరం విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు కొట్టు బాబూరావు వ్యవహరించారు. సభకు డాక్టర్ ఎ.గోపాలరావు స్వాగతం పలకగా, డాక్టర్ శిరీషా రఘురామ్‌లు వందన సమర్పణ చేశారు. సుందర యశస్వి, సుచిత్రా యశస్వి ప్రార్థన చేశారు. గురజా డ ఇందిరా స్వీయకవితా గానం చేసారు. కార్యక్రమంలో దవళ సర్వేశ్వరరావు, సోమేశ్వరరావు, ప్రాత రాజేశ్వరరావు, నీలాద్రి, హరిప్రియ, దామ రాజు శంకరం, డాక్టర్ హరిచందన్, దుర్గాప్రసాద్, సభ్యులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment