ప్రజాస్వామ్యానికి దిక్సూచి రాజ్యాంగం
విజయనగరం: దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నిలుస్తుందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించబడి 76 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించనున్న భారత రాజ్యాంగం పరిరక్షణ చైతన్య యాత్ర కరపత్రాలను ప్రదీప్ నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జెడ్పీ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే పరిస్థితులు తలెత్తే తరుణంలో పలు అంశాలు పౌరుల హక్కులను కాపాడడంలో కీలక భూమిక వహిస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగం రచన వల్ల భారత పార్లమెంటు వ్యవస్థ ద్వారా అట్టడుగు వర్గాల వారికి సామాజిక న్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో భానుమూర్తి, పూసర్ల మధుసూదనరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment