No Headline
ఆరోగ్యంగా నిండు నూరేళ్లు..
చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు ఎర్రమల్లి అప్పలరత్నం. ఆమెది బొబ్బిలి పట్టణం. ఆమె వయస్సు వందేళ్లు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. మునిమనమలు ఉన్నారు. ఇప్పటికీ ఆమెకు బీపీ, సుగర్‌వంటి వ్యాధులు ధరిచేరలేదు. మాత్రలు వేయడం తెలియదు. ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా తన పనులు తనే చక్కబెట్టుకుంటారు. ఆమె వందో జన్మదినాన్ని కుటుంబ సభ్యుల నడుమ శనివారం ఆనందంగా జరుపుకున్నారు. కేక్ కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు. పరిశుభ్రత, సమయానికి భోజనం చేయడమే తన ఆరోగ్య రహస్యమంటూ సెలవిచ్చారు. – బొబ్బిలి
Comments
Please login to add a commentAdd a comment