కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం | - | Sakshi
Sakshi News home page

కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం

Published Thu, Jan 30 2025 12:39 AM | Last Updated on Thu, Jan 30 2025 12:39 AM

కుంభమ

కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం రూరల్‌: ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరమని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మౌని అమావాస్యనాడు పుణ్యస్నానాలు ఆచరించాలని కోట్లాది మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన భక్తులు వెళ్లి ఉంటే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వ అధికారుల సూచనలు పాటిస్తూ క్షేమంగా తమతమ ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.

సర్వశిక్ష ఏపీసీగా రామారావు బాధ్యతల స్వీకరణ

విజయనగరం అర్బన్‌: జిల్లా విద్యాశాఖకు సంబంధించిన సర్వశిక్ష విభాగానికి అడిషినల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ (ఏపీసీ)గా డాక్టర్‌ ఎ.రామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టు ఎట్టకేలకు భర్తీయింది. రామారావు ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని హార్టికల్చర్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. గజపతినగరం మండలం కొనిస గ్రామానికి చెందిన రామారావు పాఠశాల విద్య ప్రభుత్వ పాఠశాలల్లో చదివి డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ కాలేజీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ బాపట్ల కళాశాల, ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ పూర్తిచేశారు. బోధన, పరిశోధన, విస్తరణలో 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన చేసిన పరిశోధన వర్క్‌ను ఐపీగర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ పేటెంట్‌ నమోదు చేసింది. త్వరలో పేటెంట్‌ అనుమతి పత్రం వస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ప్రతిరోజూ వినతుల స్వీకరణ

కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించిన జేసీ

విజయనగరం అర్బన్‌: ప్రతిరోజు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ బుధవారం ప్రారంభించారు. కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ప్రతిరోజూ ప్రజావినతులు పరిష్కార వేదిక ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు. వినతులను అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వవచ్చన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక తరహాలోనే ఈ వినతులను కూడా పరిగణించి, వాటిని ఆన్‌లైన్లో నమోదు చేసి, నంబర్‌ కూడా కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ దేవ్‌ ప్రసాద్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు మరియగిరి యాత్ర

వీరఘట్టం: వీరఘట్టానికి సమీపంలో యు.వెంకమ్మపేట వద్ద మరియగిరి కొండపై వెలసిన శ్రీకా కుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మరియమ్మ మహోత్సవానికి వేళయింది. ఏటా జనవరి 30న మరియగిరి యాత్రను నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా గురువారం నిర్వహించే మరియగిరి యాత్రకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కల, మతాలకు అతీతంగా యాత్రలో భక్తులు పాల్గొంటారు. టెంకాయలు కొట్టి, తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మరియమ్మను దర్శించుకొనేందుకు వీలుగా కొండపైన క్యూలు ఏర్పాటు చేశారు. కొండ దిగువన శ్రీకాకుళం మేత్రాసనం ఫీఠాపధిపతి రాయిరాల విజయకుమార్‌ ఆధ్వర్యంలో జరగనున్న దివ్యపూజకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ప్రార్థనా మందిరాన్ని సిద్ధంచేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చర్చి ఫాదర్‌లు, మఠకన్యలు హాజరై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. యాత్రా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం 1
1/3

కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం

కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం 2
2/3

కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం

కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం 3
3/3

కుంభమేళాలో తొక్కిసలాట దురదృష్టకరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement