అవగాహనతో ప్రమాదాల నియంత్రణ
విజయనగరం క్రైమ్: రహదారి భద్రతా నిబంధనల ఆచరణతో జిల్లాలో ప్రమాదాలను నియంత్రించవచ్చని ఎస్పీ వకుల్ జిందల్ పేర్కొన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను బుధవారం ఆదేశించారు. వచ్చేనెల 15 వరకు రహదారి భద్రత మాసోత్సవాలు కొనసాగుతాయన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఊహించని ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడే రక్షణ రేఖ హెల్మెట్ధారణగా పేర్కొన్నారు. బ్లాక్‌స్పాట్స్ గుర్తించి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. గతేడాది హెల్మెట్ ధరించని 6,392 మందిపై ఎం.వి.చలానాలను విధించామన్నారు.
ఫిబ్రవరి 15 వరకు రహదారి భద్రత మాసోత్సవాలు
గతేడాది 98,358పై
ఈ చలానాలు విధించాం
ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment