హెల్మెట్ వినియోగం తప్పనిసరి
విజయనగరం అర్బన్: ద్విచక్రవాహనాలు నడిపేవారికి హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పోలీస్ అధికారులకు సూచించారు. వచ్చే రెండు నెలల్లో పూర్తిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కలిగించాలని కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. దీనికోసం రవాణా, పోలీస్, జాతీయ రహదారుల, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, రవాణా డిప్యూటీ కమిషనర్ మణికుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమణి, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆర్టీఓ విమల, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
కల్టెర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment