ఎంత చేసినా తక్కువే.. | Sakshi
Sakshi News home page

ఎంత చేసినా తక్కువే..

Published Sun, May 5 2024 1:15 AM

ఎంత చ

పాలమూరుకు

శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారు..

పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దు.. ఈ ప్రభుత్వాన్ని పడగొడ్తామని అంటున్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలకతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ముఖ్యమంత్రిగా నాకు వచ్చింది. కానీ ఇక్కడి వారే శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీకే అరుణ ఏమంటా ంది.. రేవంత్‌రెడ్డి నా మీద పగబట్టిండు. నన్ను ఓడగొట్టాలని చూస్తున్నా డు. నేను మాత్రం కాంగ్రెస్‌ను ఓడగొట్టే వరకు ఊరుకోను. . ఖతం చేస్తా అంటది. కాంగ్రెస్‌ నీకు ఏం అన్యాయం చేసింది? పాన్‌గల్‌ నుంచి జెడ్పీటీసీగా, గద్వాల ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కాంగ్రెస్‌ను ఓడగొట్టాల్నా? దేశం, రాష్ట్రంలో నిన్ను గుర్తు పడుతోంది కాంగ్రెస్‌తోనే కదా.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘నేను అమెరికాలో చదువుకునో, రాజకీయ వారసత్వంతోనో ముఖ్యమంత్రిని కాలేదు. నల్లమలలోని కొండారెడ్డిపల్లిలో పుట్టిన నేను వనపర్తిలోని జెడ్పీ స్కూలులో, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివా. వనపర్తిలోని ప్రతి గల్లీ, ప్రతీ విధితో నాకు గత 40 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇక్కడే పోలీస్‌ ఉద్యోగం చేసిన మా అన్న భూపాల్‌రెడ్డి చాలామందికి తెలుసు. ఇంటర్‌ చదువుతున్నప్పుడు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చిన్నారెడ్డికి రాజీవ్‌గాంధీ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే.. చిన్నన్న గెలుపు కోసం వనపర్తి, కొత్తకోటలోని గల్లీల్లో గోడల మీద రాతలు రాసినోడిని. మీ చెమటతో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి తెలంగాణలో రెండో సీఎంగా నన్ను కూర్చోబెట్టారు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్క నేడు వృక్షంలా మారి ముఖ్యమంత్రిగా ఎదిగాడు. మీ ఆదరణకు ఈ జన్మలో ఎంత చేసినా తక్కువే.’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధి వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌షో, జనజాతర కార్నర్‌ మీటింగ్‌కు జనం పోటెత్తారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఈ జనసందోహాన్ని చూస్తుంటే కృష్ణానది పరవళ్లు తొక్కుతూ సునామీలాగా వచ్చి కొత్తకోటను కప్పేసినట్టుగా ఉందన్నారు. ‘మీ ఆదరణకు నా మనసు తన్వయత్వాన్ని పొందుతోంది. మీ అభిమానానికి, మీరిచ్చిన ఆశీర్వాదానికి ఈ జన్మలో ఏం చేసినా, ఎంత ఇచ్చినా తక్కువే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే. పాలమూరు బిడ్డగా ఇక్కడి ప్రజల వలసలు ఆపేందుకు, పచ్చని పంటలు పండించేందుకు నా ఆరాటం ఆగదు.’ అని అన్నారు.

మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. చిత్రంలో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మలు ్లరవి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి

M>…{VðS-‹Ü¯]l$ VðSÍ-í³…^é-ÌS¯]l-yýl…-ేæ ™èl´ëµ..

కాంగ్రెస్‌ పార్టీ నాకు కొడంగల్‌లో ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ఓడిపోయినా.. మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచినా. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అయ్యా.. ఇప్పుడు సీఎం అయ్యాను. గవర్నమెంట్‌ స్కూల్‌లో చదువుకున్న నన్ను కాంగ్రెస్‌ సీఎం చేసింది. అందుకు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎంపీగా గెలిపించండి.. అభివృద్ధికి పాటుపడతా అంటే అది నేను చేసిన తప్పా.. నేరమా? ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే కదా.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా. ఉమ్మడి పాలమూరులో 14 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు వేయాలని చిన్నారెడ్డికి బాధ్యతలు అప్పగించినం. మాదిగల వర్గీకరణ, ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏకి మార్చడం, వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా రావాలంటే మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లురవిని గెలిపించాలి.

ఎంత చేసినా తక్కువే..
1/1

ఎంత చేసినా తక్కువే..

Advertisement
Advertisement