మహనీయుల త్యాగాలు మరవద్దు
ఎర్రవల్లి: ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే ఈరోజు మనమంతా స్వతంత్రంగా జీవిస్తున్నామని.. అలాంటి వారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పదో పటాలం కమాండెంట్ ఎన్‌వీ సాంబయ్య కోరారు. ఆదివారం ఎర్రవల్లి మండలం బీచుపల్లి పదోపటాలంలో జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినందున గణతంత్ర దినోత్సవంగా జరుపుకొంటున్నామని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం కన్న కలలను సాకారం చేసేందుకు కృషిచేయాలన్నారు. అనంతరం పటాలంలోని వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన విశ్రాంత సిబ్బందిని కమాండెంట్ అభినందించి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ టి.పాణి, ఆర్‌ఐలు రాజు, వెంకటేశ్వర్లు, ఆర్పీ సింగ్, రాజారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పదోపటాలం కమాండెంట్
ఎన్‌వీ సాంబయ్య
Comments
Please login to add a commentAdd a comment