ఇక్కడ విధులు నిర్వహించడం గర్వంగా ఉంది
దోమలపెంట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహించడం గర్వంగా ఉందని సీఈ రామసుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈగలపెంటలోని శక్తిసదన్ కార్యాలయం వద్ద ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భూగర్భ కేంద్రం జెన్‌కో యాజమాన్యం ఇచ్చిన టార్గెట్ 2,000 యూనిట్లను అధిగమించి ఉత్పత్తి చేశామన్నారు. ఇంకా లోడ్ డిస్పాచ్ అడిగిన వెంటనే విద్యుత్తు ఉత్పత్తి సరఫరాకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఆణిముత్యం లాంటి కేంద్రంలో పంప్‌మోడ్ పద్ధతిలో ఈ ఏడాది గణనీయంగా సాగర్ జలాశయం నుంచి శ్రీశైలం జలాశయంలోకి నీటిని తరలించామన్నారు. యాజమాన్యం ఇటీవల కేంద్రంకు ముప్‌పై మంది నూతన ఏఈలను కేటాయించిందని తెలిపారు. ఎస్‌ఈ(ఓఅండ్‌ఎం) ఆదినారాయణ, కేంద్రం యావత్తు ఇంజినీర్లు ఉద్యోగులు పాల్గొన్నారు. తదుపరి ఎస్‌పీఎఫ్ ఆర్‌ఐ రవి పర్యవేక్షణలో ఎస్‌ఐలు అనూప్, శ్రావణ్, పోలీసుల నుంచి వందన స్వీకరించారు.
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రం సీఈ రామసుబ్బారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment