కాల్వకు గండి..
మల్దకల్: మండలంలోని చర్లగార్లపాడు శివారులో 106 ప్యాకేజీ కాల్వకు ఆదివారం గండి పడటంతో పంటలు నీట మునిగాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాల్వ షట్టర్‌ను కొందరు రైతులు మూసి వేయడంతో నాగర్‌దొడ్డి, కుర్తిరావులచెర్వు మీదుగా తూంకుంటకు వెళ్లే కాల్వలో నీటి ఉధృతి పెరగడంతో పాటు కాల్వలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో కాల్వ తెగిపోయింది. నీరంతా పంట పొలాల్లోకి చేరడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే నీటి సరఫరాను నిలిపి వేశారు. మొత్తం 25 ఎకరాల్లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఉల్లి, పొగాకు పంటలు దెబ్బతిన్నట్లు రైతులు సుధాకర్, ధర్మన్న, నాగరాజు, ప్రేమ్‌రాజ్, ప్రసాద్, కర్రెన్న, బుడ్డన్న, వెంకటన్న తెలిపారు. నష్ట పరిహారం అందించడంతో పాటు కాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment