అధిక ధరలను అరికట్టాలి | Sakshi
Sakshi News home page

అధిక ధరలను అరికట్టాలి

Published Sat, May 25 2024 1:25 PM

అధిక ధరలను అరికట్టాలి

కాళోజీ సెంటర్‌ : అధిక ధరలకు విత్తనాలు అమ్ముతున్న షాపుల యజమానులపై వెంటనే చర్య తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ సోమిడి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంఘం నాయకులతో కలిసి డీఆర్‌ఓ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు విత్తనాల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని, దీంతో యజమానులు అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నారని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా విత్తన వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిందని తెలిపారు. మరికొంతమంది నకిలీ విత్తనాలు తయారు చేస్తూ రైతులకు విక్రయిస్తున్నారని, ఈ విత్తనాలతో వేసిన పంట సుమారు నాలుగు నుంచి 6 నెలల వరకు ఎలాంటి పూతకాత లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. అప్పటికే రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ధరలు, నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, నాయకులు ఊరటి హంసల్‌రెడ్డి, నల్ల విజేందర్‌రెడ్డి, సిరుల రవీందర్‌, మొకిడే పేరయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement